Aryan Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) డ్రగ్స్ కేసులో అరెస్టయి అక్టోబర్ 7 వరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడీ విధించింది. దీంతో అతడు జైల్లో ఉన్నాడు. ఆర్యన్ కు ఆయన కోరిక మేరకు సైన్స్ పుస్తకాలు అందజేస్తున్నారు. ఆర్యన్ ఖాన్ తోపాటు అరెస్టయిన నిందితులకు అక్కడే భోజనం పెడుతున్నారు. ఇంటి భోజనం అనుమతి లేకపోవడంతో ఎన్సీబీ మెస్ నుంచే భోజనం వడ్డిస్తున్నారు.

ఆర్యన్ ఖాన్ ఫోన్ ను ఫోరెనిక్స్ పరీక్ష కోసం పంపించారు. డేటాను బేస్ చేసుకునే పనిలో పడ్డారు. అక్టోబర్ 5న ముంబై క్రూయిజ్ షిప్ నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకుుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్సీబీ అధికారులు క్రూయిజ్ షిప్ పై దాడిచేసిన తరువాత ఆర్యన్ ఖాన్, అర్పాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాతో సహా తొమ్మిది మందిని అరెస్టు చేసింది.
రేపటితో ఆర్యన్ ఖాన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కస్టడీ ముగుస్తుంది. ఈకేసులో ఎన్సీబీ అధికారులు పలు సాక్ష్యాలు సేకరిస్తోంది. ఆర్యన్ ఖాన్ గత నాలుగు సంవత్సరాలుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆర్యన్ ఖాన్ తో పాటు అరెస్టయిన వారి నుంచి పలు వివరాలు సేకరిస్తున్నారు. ఎన్సీబీ అధికారులు పలు కోణాల్లో విచారణ సాగిస్తున్నారు.
ఆర్యన్ ఖాన్ తన స్నేహితుల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే డ్రగ్స్ కేసులో పలు కేసులు నమోదు కాగా ప్రస్తుతం అరెస్టుల వరకు వెళ్లడంతో కేసు మరింత బలంగా మారనుంది. సినిమా తారల బాగోతం ఇలా వెలుగు లోకి రావడం చూస్తుంటే సామాన్యులకే విస్తు గొలుపుతోంది. మొత్తానికి ఈ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టుతో ప్రతిష్ట దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది.