Anushka Shetty: యోగ టీచర్ అయిన అనుష్క శెట్టి సూపర్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. 2005లో విడుదలైన క్రైమ్ యాక్షన్ డ్రామా సూపర్ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకుడు. నాగార్జునకు జంటగా అనుష్క శెట్టి, అయేషా టాకియా నటించారు. సోనూ సూద్ ఈ మూవీలో మరో కీలక రోల్ చేశాడు. సూపర్ మూవీ ఆడియన్స్ కి వచ్చిన అనుష్కను నాగార్జున జస్ట్ అలా చూసి ఓకే చేశాడట. అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ. పూరి జగన్నాధ్ ఆడిషన్ చేస్తుంటే.. నాకు ఏం తెలియదు అని సమాధానం చెప్పిందట.
Also Read: ఎట్టకేలకు ‘బాహుబలి 2 ‘ ని దాటేసిన ‘చావా’..’పుష్ప 2′ ని అందుకోవాలంటే ఇంకా ఎంత గ్రాస్ రావాలో తెలుసా!
అమ్మాయి బాగుంది. సినిమాకు సెట్ అవుతుంది తీసుకో అని నాగార్జున సలహా ఇచ్చాడట. ఆ విధంగా అనుష్కకు హీరోయిన్ ఆఫర్ వచ్చింది. ఇక స్వీటీ పేరు బాగోలేదని పూరి జగన్నాధ్ అనుష్క అనే పేరు పెట్టాడట. సూపర్ సినిమాకు పని చేయడనికి వచ్చిన ముంబై డిజైనర్ పేరు అట అది. నటన తెలియకున్నా.. అనుష్క స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. విక్రమార్కుడు, అరుంధతి, లక్ష్యం, బిల్లా వంటి చిత్రాలు బ్రేక్ ఇచ్చాయి.
మిర్చి, బాహుబలి, బాహుబలి 2 ఆమె కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ గా ఉన్నాయి. అరుంధతి అనంతరం అనుష్కకు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ కూడా తలుపుతట్టాయి. అయితే అనుష్క ఒక తెలుగు సీరియల్ లో నటించిందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అనుష్క నటించిన ఎపిసోడ్ యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. ఆ సీరియల్ లో యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఉంది. నటుడు కృష్ణుడు సైతం నటించాడు. ఆ సీరియల్ పేరు యువ అని సమాచారం. మా టీవీలో ఈ యూత్ఫుల్ సీరియల్ ప్రసారమైంది. అయితే అనుష్క చిన్న గెస్ట్ రోల్ చేసినట్లు సమాచారం. రాజమౌళి కూడా నటించాడు అట. అనుష్క ఒక కన్నడ సీరియల్ లో సైతం నటించినట్లు తెలుస్తుంది.
అనుష్క కెరీర్ పరిశీలిస్తే… బాహుబలి 2 తర్వాత ఆమె ఆచితూచి సినిమాలు చేస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఘాటీ మూవీ చేస్తుంది. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీ. అనుష్క ఫ్యాన్స్ ఆతృతగా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.
https://www.youtube.com/watch?v=BlV4xif3Iqs&ab_channel=MahaboobbashaShaik