Ponniyin Selvan- Mahesh Babu: ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ‘పొన్నియన్ సెల్వన్’..మణిరత్నం ఈ చిత్రాన్ని తన డ్రీం ప్రాజెక్ట్ గా ఎంతో భారీ బడ్జెట్ మరియు భారీ తారాగణం తో కనివిని ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు..పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా వసూళ్ల పరంగా మాత్రం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో ప్రభంజనం సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుంది..మొదటి రోజు సుమారు 83 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను వసూలు చేసింది..అలా మొదటి మూడు రోజులు అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా 200 కోట్ల రూపాయిల వసూళ్లను దక్కించుకొని ప్రభంజనం సృష్టించింది..అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందు జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇక అసలు విషయానికి వస్తే ఈ పొన్నియన్ సెల్వన్ అనే సినిమాని మణిరత్నం గారు ఎప్పుడో పదేళ్ల క్రితమే తియ్యాలనుకున్నాడు..తారాగణం కూడా సౌత్ లోనే బడా సూపర్ స్టార్స్ గా వెలుగొందుతున్న మహేష్ బాబు మరియు విజయ్ వంటి హీరోలను అనుకున్నాడు..మహేష్ బాబు డి టైటిల్ పాత్ర ‘పొన్నియన్ సెల్వన్’..ఈ పాత్రని ఇప్పుడు జయం రవి చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది..ఇక హీరో విజయ్ పాత్రని కార్తీ చేసాడు..ఒక విధంగా చెప్పాలంటే స్లో స్క్రీన్ ప్లే తో సాగే ఈ సినిమాని సగటు ప్రేక్షకుడిని చివరి వరుకు కుర్చోపెట్టేలా చేసింది మాత్రం కార్తీ పోషించిన పాత్రే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..అలాంటి పాత్రలను ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ వదులుకోవాల్సి వచ్చింది.

అప్పటి మార్కెట్ ప్రకారం అంత పెద్ద బడ్జెట్ పెట్టె నిర్మాత లేకపోవడం వల్లే ఈ సినిమా పట్టాలెక్కలేకపోయింది..ఇప్పుడు బాహుబలి , #RRR వంటి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించడం తో మణిరత్నం కి పొన్నియన్ సెల్వన్ సినిమాని తీసేందుకు ధైర్యం వచ్చింది..ఇప్పుడు దాని ఫలితం ఈరోజు మన అందరం చూస్తున్నాము.