Hero Nani : సెట్స్ పై ఉండగా సినిమాకి సంబంధించిన ఎలాంటి విషయాలు బయటపడకుండా టీమ్ జాగ్రత్తపడతారు. రాజమౌళి అయితే సెట్స్ లో సిబ్బంది ఎవరూ మొబైల్ ఫోన్ వాడకూడని స్ట్రిక్ట్ రూల్ పెడతారు. సినిమాకు సంబంధించిన కీలక విషయాలు లీకైతే ఎవరైనా వాడేసుకుంటారని, జనాల్లో మూవీపై హైప్ పోయే ప్రమాదం ఉంటుందని దర్శక నిర్మాతలు అలా జాగ్రత్త పడతారు. అయితే హీరో నాని స్వయంగా ఓ సాంగ్ లీక్ చేయడం సంచలనంగా మారింది. నాని లేటెస్ట్ మూవీ దసరా మూవీ నుండి సాంగ్ వీడియో బైట్ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దర్శకుడు దసరా సందర్భంగా ఎలాంటి ప్రోమో విడుదల చేయడం లేదని ప్రకటించిన నేపథ్యంలో నాని దీనికి పాల్పడ్డాడు. దసరా మూవీ కోసం సాంగ్ షూట్ చేస్తుండగా నాని ఫోన్ తో ఒకరు రికార్డు చేశారు. అప్పుడు రికార్డు చేసిన వీడియోను ట్విట్టర్ లో నాని పోస్ట్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పండుగకు ప్రోమో విడుదల చేయడం లేదన్నాడు. అందుకే నేను నా సెల్ ఫోన్ లో రికార్డు చేసిన సాంగ్ వీడియోను లీక్ చేస్తున్నానంటూ కామెంట్ పెట్టాడు.
ఇక నాని లీక్ చేసిన వీడియోలో మాస్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. బొగ్గు గనుల్లో దుమ్ములో డాన్సర్స్ తో పాటు నాని డప్పు దెబ్బలకు మాస్ స్టెప్స్ వేస్తున్నారు. పెరిగిన జుట్టు గెడ్డం, మాసిపోయిన బట్టల్లో నాని డీగ్లామర్ లుక్ కేకగా ఉంది. అయితే ఇదంతా సినిమా ప్రమోషన్ కోసమే. తన సినిమా గురించి మీడియాలో రావాలని నాని ఇలా లీక్ అంటూ అప్డేట్ ఇచ్చాడు. కాగా అక్టోబర్ 3న దసరా మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నారు.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ నానికి జంటగా నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా ఉన్నారు. నాని కెరీర్ లో భారీ బడ్జెట్ తో దసరా తెరకెక్కుతుంది. ఇక ఆయన నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. దసరా చిత్రాన్ని ఐదు భాషల్లో 2023 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నారు. ఇక వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న నాని దసరా చిత్రంతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారు. నాని గత చిత్రం అంటే సుందరానికీ తీవ్రంగా నిరాశపరిచింది.
Since @odela_srikanth says no promo. Leaking something I recorded in my phone while we filmed the song 🙂
రేపటి సంది దుమ్ము లేశిపోద్ది pic.twitter.com/OQeevCqdD1
— Nani (@NameisNani) October 2, 2022