Nagarjuna: అక్కినేని నాగార్జున హీరోగా చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలు అయితే అందుకున్నాయి. ముఖ్యంగా శివ సినిమాతో ఒక్కసారిగా మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగార్జున అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాను చేసుకుంటూ వస్తున్నాడు. మధ్యలో అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తి రస ప్రధానమైన చిత్రాలను చేసినప్పటికీ ఆయన రొమాంటిక్ సినిమాలకు పెట్టింది పేరుగా మారారు. మొదటి నుంచి కూడా రొమాంటిక్ యాంగిల్ లో ఉండే సినిమాలను ఎక్కువగా చేయడం వల్ల నాగార్జునకు రొమాంటిక్ హీరో అనే గుర్తింపు కూడా వచ్చింది. మరి ఇలాంటి సందర్భంలో భక్తిరస ప్రధానమైన సినిమాలను కూడా చేసిన నాగార్జున ప్రేక్షకులందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కూడా నాగార్జున సినిమాకి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇక ఆయన ఒక పాత్రలో నటించి మెప్పించడంలో సిద్ధహస్తుడనే చెప్పాలి. ఎలాంటి పాత్ర అయిన సరే అలావొక గా నటించి అందులో పరకాయ ప్రవేశం చేసి మరి ప్రేక్షకులచేత శభాష్ అనిపించుకుంటాడు. అంతటి నైపుణ్యం కలిగిన నాగార్జున సినిమాలను సెలెక్ట్ చేసుకోవడం మాత్రం కొన్నిసార్లు మిస్టేక్స్ అయితే చేస్తుంటాడు. ఇక కొన్ని సినిమాలు కథల పరంగా బాగున్నప్పటికీ దర్శకులు వాటిని తెరకెక్కించే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల ఆ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అయితే ఆయన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాల్లో కొన్ని మాత్రం భారీ డిజాస్టర్లు గా మిగిలాయి.
అందులో రక్షకుడు, ఆఫీసర్, గోస్ట్ లాంటి సినిమాలు నాగార్జునను భారీగా నిరాశపరిచాయి. ముఖ్యంగా రక్షకుడు సినిమా మీద ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కాని వాటన్నింటినీ తలకిందులు చేస్తూ ఈ సినిమా ఆయనను ఒక్కసారిగా కోలుకోలేని దెబ్బ కొట్టిందనే చెప్పాలి.
ఒకప్పుడు పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఎంగేజ్ చేయలేదు. అలాగే నాగార్జున కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా మారింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికీ నాగార్జున ఢీలా పడ్డాడు.
ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో మాత్రం నాగార్జున ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నాడు. అయినప్పటికీ ఆయన సినిమా సెలక్షన్ లోనే చాలా వరకు మిస్టేక్స్ ఉంటున్నాయి. వాటిని కనక సరి చేసుకున్నట్లైతే ప్రస్తుతం నాగార్జున మంచి విజయాలను అందుకుంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…