Pawan Kalyan Tholi Prema: పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ తొలిప్రేమ. నెలల తరబడి ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ థియేటర్స్ లో ఆడింది. కామెడీ, రొమాన్స్, ఎమోషన్ జోడించి ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీని కరుణాకర్ తెరకెక్కించారు. తొలిప్రేమ వసూళ్ల వర్షం కురిపించగా కరుణాకర్ పేరు మారుమ్రోగింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. పవన్ కళ్యాణ్ కి స్టార్డమ్ తెచ్చిపెట్టిన చిత్రంగా తొలిప్రేమను చెప్పుకోవచ్చు. తర్వాత చిత్రాలతో ఆయన మాస్ హీరో అయ్యారు.
తొలిప్రేమ చిత్రాన్ని జూన్ 30న రీరిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత జీవీజీ రాజు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ అప్పటికి అప్ కమింగ్ హీరో. ఆయన రెమ్యూనరేషన్ లక్షల్లో ఉంది. రెమ్యూనరేషన్ ఎలా ఇవ్వమంటావని నేను పవన్ కళ్యాణ్ ని అడిగాను. ఆయన మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా ఇవ్వండి అన్నారు. ఇప్పుడు కొంత సినిమా విడుదలయ్యాక కొంత ఇస్తానని చెప్పాను.
నెల నెలా కొంత డబ్బులు ఇవ్వండి, నాకు ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నారు. నేను అలానే చేశాను. ఆ డబ్బులతో పవన్ కళ్యాణ్ పుస్తకాలు, మొబైల్ కొనుక్కున్నాడు. సినిమా విడుదలైన రెండో రోజు మిగిలిన రెమ్యూనరేషన్ మొత్తం ఇచ్చేశానని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కి ఎన్ని లక్షలు రెమ్యూనరేషన్ గా ఇచ్చింది మాత్రం నిర్మాత చెప్పలేదు.
ఈ మూవీ షూటింగ్ లో కొందరు నిజమైన ప్రేమికులుగా మారిపోయారని ఆయన వెల్లడించారు. పవన్ చెల్లెలు పాత్ర చేసిన వాసుకి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని ప్రేమించారు. వీరిద్దరూ అనంతరం పెళ్లి చేసుకున్నారు. ఊటీలో కారు యాక్సిడెంట్ షూట్ లో నిజంగానే ప్రమాదం జరిగింది. డూప్స్ గా చేసిన అబ్బాయి, అమ్మాయికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన వారు ప్రేమికులు అయ్యారని జీవీజీ రాజు చెప్పుకొచ్చారు.