https://oktelugu.com/

Naresh- Pavitra Lokesh: నరేష్ ని పవిత్ర ఏమని పిలుస్తుందో తెలుసా? వీళ్ళు మామూలు రొమాంటిక్ కాదు!

ఇటీవల మళ్ళీ పెళ్లి టైటిల్ తో నరేష్ ఓ మూవీ విడుదల చేశారు. చెప్పాలంటే ఇది నరేష్ బయోపిక్. రమ్య రఘుపతి, పవిత్ర లోకేష్ తన జీవితంలోకి వచ్చాక జరిగిన సంఘటనలను సినిమాగా తీశాడు.

Written By:
  • Shiva
  • , Updated On : September 6, 2023 / 02:32 PM IST

    Naresh- Pavitra Lokesh

    Follow us on

    Naresh- Pavitra Lokesh: లేటు వయసులో ఘాటుగా ప్రేమించుకుంటున్న నరేష్-పవిత్ర లోకేష్ టాలీవుడ్ క్రేజీ కపుల్ అయ్యారు. కొన్నాళ్ళు రహస్యంగా వీరి బంధం సాగింది. గత ఏడాది వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో అనేక వివాదాలు నడిచాయి. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వీరి బంధాన్ని వ్యతిరేకిస్తుంది. రమ్యతో విడిపోయి చాలా ఏళ్ళు అవుతుంది. ఆమె జీవితం ఆమెది నా జీవితం నాది. పవిత్రను కాదనే హక్కు తనకు లేదని నరేష్ వాదన. గత ఏడాది కాలంగా నరేష్-రమ్య రఘుపతి మధ్య సీరియస్ వార్ నడుస్తుంది.

    ఇటీవల మళ్ళీ పెళ్లి టైటిల్ తో నరేష్ ఓ మూవీ విడుదల చేశారు. చెప్పాలంటే ఇది నరేష్ బయోపిక్. రమ్య రఘుపతి, పవిత్ర లోకేష్ తన జీవితంలోకి వచ్చాక జరిగిన సంఘటనలను సినిమాగా తీశాడు. అయితే ఈ విషయాన్ని నరేష్ ఖండించారు. మళ్ళీ పెళ్లి నా బయోపిక్ కాదని ఆయన అంటారు. ఈ చిత్రంలో రమ్య రఘుపతి పాత్రను నరేష్ తప్పుగా చూపించాడు. ఈ సినిమా విడుదల ఆపేయాలని, ఓటీటీలో కూడా స్ట్రీమ్ చేయకూడని రమ్య కోర్టును ఆశ్రయించింది.

    ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సినిమా విషయంలో నరేష్ కి అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. ఇక నరేష్-పవిత్ర హ్యాపీగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకోకున్నా వారిద్దరూ భార్యాభర్తల మాదిరే మెలుగుతున్నారు. ప్రపంచంలోని ప్రతి అందమైన ప్రదేశం జంటగా చూడాలనేది వీరి కల. అందులో భాగంగా కొన్ని దేశాలను చుట్టేశారు కూడాను.

    ఇక వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమగా పిలుచుకుంటారట. ఇద్దరికీ ముద్దు పేర్లు ఉన్నాయట. పవిత్రను నేను అమ్ములు అని పిలుస్తానని నరేష్ గతంలో చెప్పారు. తాజాగా ఓ షోకి వచ్చిన పవిత్ర లోకేష్ నరేష్ ముద్దు పేరు బయటపెట్టింది. ఆమె నరేష్ ని రాయ అని పిలుస్తుందట. నరేష్-పవిత్రల తీరు చూసిన జనాలు వీరు సో రొమాంటిక్ అంటున్నారు. ఈ షోలో హైపర్ ఆది కూడా ఉన్నాడు. నరేష్-పవిత్రల మీద సున్నితమైన పంచ్లు వేశాడు.