Pawan Kalyan Johnny Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. గత 50 సంవత్సరాల నుంచి మెగాస్టార్ గా తనకంటూ ఒక మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న చిరంజీవి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో ఎవర్ గ్రీన్ హీరోగా నిలిచిపోయాడు. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి కూడా ఆయన ఎదిగాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక అలాంటి చిరంజీవి తమ్ముడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం కెరియర్ మొదట్లో వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక ఆ తర్వాత ఒక పది సంవత్సరాలపాటు అతనికి ఒక్క సక్సెస్ కూడా రాలేదు. మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ సక్సెస్ లను అందుకోలేకపోయిన కూడా ఆయన ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఆయన క్రేజ్ ఇప్పటికి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇప్పటికీ ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు…అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకుడు కూడా ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇక ఇదిలా ఉంటే తన కెరియర్లో చేసిన సినిమాలు ఒకెత్తయితే ఆయన డైరెక్షన్ లో చేసిన జానీ సినిమా మరొకెత్తనే చెప్పాలి. అయితే ఈ సినిమా చాలా స్లోగా ఉండటం వల్ల ప్రేక్షకులకు ఎక్కలేదు.
దానికి తోడుగా పవన్ కళ్యాణ్ ను అంతకు ముందు చాలా జోష్ ఫుల్ క్యారెక్టర్ లో చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలో కొంచెం డల్ గా కనిపించడంలో జీర్ణించుకోలేకపోయారు. ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముందే చిరంజీవికి కథ వినిపించారట. అయితే ఆ కథను విన్న చిరంజీవి కథ బానే ఉంది.
కానీ కథ ఇప్పుడున్న జనరేషన్లో ప్రేక్షకులకు నచ్చదని చెప్పారట. అయినప్పటికి పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ను సాధించి చూపిస్తానని చిరంజీవితో చెప్పి మరి ఈ సినిమాని చేశాడు. అయినప్పటికి ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్నైతే సాధించలేదు.
ఇక అప్పటినుంచి మొదలైన పవన్ కళ్యాణ్ లో ప్లాప్ ల పరంపర దాదాపు పది సంవత్సరాలపాటు కొనసాగుతూనే వచ్చింది. మరి ఏది ఏమైనా కూడా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి చెప్పినట్టుగా విని ఉంటే బాగుండేది. కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉంటే బాగుండేదేమో అని పవన్ కళ్యాణ్ ఇప్పటికీ రిగ్రేట్ ఫీల్ అవుతూ ఉంటానని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…