Lata Mangeshkar: భారత గాన కోయిలమ్మ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ ఇక లేరు అనే విషయాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆమె మన మధ్యన లేకపోయినా.. ఆమె పాటలు శాశ్వతంగా ఉంటాయి. ఇక ఆ దిగ్గజ గాయని దేశంలోని వివిధ భాషల్లో పాటలు పాడారు. తెలుగులో మాత్రం చాలా తక్కువ పాటలు పాడారు. తొలిసారిగా 1955లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన సంతానం సినిమాలో ‘నిదురపోరా తమ్ముడా’ అనే పాట పాడారు.

ఆ తర్వాత 1965లో ఎన్టీఆర్, జమున నటించిన ‘దొరికితే దొంగలు’ మూవీలో ఓ పాట ఆలపించారు. అలాగే 1988లో నాగార్జున, శ్రీదేవి నటించిన ఆఖరి పోరాటంలో ‘తెల్లచీరకు’ పాటను SP బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు. ఆమె తెలుగులో తక్కువ పాటలు పాడినా.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె దగ్గర అవ్వడం నిజంగా విశేషమే.
Also Read: యంగ్ హీరోయిన్ తో రవితేజ లిప్ లాక్ !
అన్నట్టు గానకోకిల లతామంగేష్కర్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. 2011లో భారత్ ప్రపంచ కప్ గెలవాలని ఉపవాసం ఉన్నారు. ఈ విషయాన్ని అప్పట్లో ఆమెనే స్వయంగా తెలిపారు. ‘నేనూ, నా ఫ్యామిలీ మ్యాచ్ జరిగేంత సేపు ఓ మూఢ నమ్మకాన్ని ఫాలో అయ్యాం. భారత్ గెలవాలని ఏమీ తినలేదు. తాగలేదు. చాలా టెన్షన్ పడ్డాం. భారత్ మ్యాచ్ గెలిచాక డిన్నర్ చేశాం’ అని చెప్పారు.

1983లో ఫైనల్ మ్యాచ్ ను లతామంగేష్కర్ లండన్ వెళ్లి చూశారు. పైగా ఆమె అప్పట్లో భారత్ గెలవాలని ఉపవాసం కూడా చేశారు. బహుశా స్వఛ్ఛమైన ఆమె మనసుతో ఉపవాసం చేయడం కారణంగానే ఆమె ఇండియా గెలిచి ఉంటుంది.
Also Read: ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా ఈ పనులను చేయకూడదు.. చేస్తే అరిష్టమే!
[…] Sampath Raj: రఘువరన్ బీటెక్.. ఇంజినీరింగ్ చేసిన ప్రతి నిరుద్యోగికి ఈ మూవీ అంటే ఎంతో ఇష్టం.. వారి కష్టాలను ఈ మూవీలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఇందులో హీరో హీరోయిన్లుగా ధనుష్, అమలాపాల్ యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ హీరో తల్లి.. ఈ క్యారెక్టర్‌లో శరణ్య తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. మూవీలో ఈ క్యారెక్టర్‌తోనే సెంటిమెంట్ సన్నివేశాలు పండాయి. ఒక విధంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడానికి కారణం ఈ క్యారెక్టర్ అనే చెప్పాలి. ఈ మూవీతో శరణ్య తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. […]
[…] Andhra Pradesh Government: ఆంధ్రప్రదేశ్ లో అప్పుల బారం పెరిగిపోతోంది. దీంతో సీఎం జగన్ ఆపసోపాలు పడుతున్నారు. నెలనెల ప్రభుత్వ నిర్వహణ కష్టంగా మారుతోంది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు గా ఉంది పరిస్థితి. అందినకాడల్లా అప్పులు చేస్తూ లక్షలాది కోట్లు అప్పులు చేస్తూ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు. ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో నెలనెల గడవడం కష్టంగా మారుతోంది. దీనిపై జగన్ కూడా లోలోపల బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్తులను ఎక్కడికక్కడ తనఖా పెడుతూ రుణాలు తీసుకుంటున్నారు. […]
[…] Cinema Viral: టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. రవితేజ ‘ఖిలాడి’ ఒక్కటే కదా రిలీజ్‌కి రెడీగా ఉంది అనుకుంటున్నారా.? మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘ఖిలాడి’ ఫిబ్రవరి 11న రిలీజ్ కానుండగా.. అదే రోజు రవితేజ సమర్పిస్తోన్న ‘FIR’ కూడా విడుదల కానుంది. ఆ సినిమాలో తమిళ నటుడు విష్ణు విశాల్ నటించాడు. ఈ ఇద్దరూ కలిసి ప్రస్తుతం ఒకే సినిమాలో నటిస్తున్నారు. కాగా.. ఒకే రోజు రవితేజ నటించి, సమర్పిస్తున్న చిత్రాలు రిలీజ్ కానుండటంతో ఏది పైచేయి సాధిస్తుందోనని ఆసక్తి నెలకొంది. […]
[…] Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ ‘ఖిలాడీ’. ఈ నెల 11న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఈ సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్ ను విడుదల కానుంది. కాగా తాజాగా ఈ రోజు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని CBFC నుండి U/A సర్టిఫికేట్ పొందింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ అంచనాలను పెంచగా.. రమేష్ వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. […]
[…] […]