Revanth: తెలుగు సింగర్ రేవంత్ పెళ్లి వేడుకగా జరిగింది. కోవిడ్ నేపథ్యంలో కొద్దిమంది సన్నిహితుల మధ్యే ఈ ఈవెంట్ జరిగింది. గుంటూరుకు చెందిన అన్వితను ఆయన వివాహం చేసుకున్నాడు. ఈ వేడుకకు పలువురు సింగర్స్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కాగా ఇండియన్ ఐడల్-9 విజేతగా రేవంత్ నిలిచిన సంగతి తెలిసిందే.

ఇక పలువురు సెలబ్రిటీలు సైతం ఈ పెళ్లికి హాజరు అయ్యారు. సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం రేవంత్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అన్నారు డిసెంబర్ 24న వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
Also Read: హీరోయిన్లను మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్న సీరియల్ నటి.. ఇండియాలో ఈమెనే టాప్..!
కాగా ఈ సందర్భంగా రేవంత్ తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ ఎంగేజ్ మెంట్ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. మీ జంట బాగుంది అంటూ నెటిజన్లు కూడా వీరిద్దర్నీ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు.

ఇక టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ గా రేవంత్ ప్రస్తుతం ఉన్నాడు. ఇండియన్ ఐడల్ 9 విజేతగా రేవంత్ కి ఫుల్ క్రేజ్ ఉంది. గుంటూరుకు చెందిన అన్వితతో ప్రేమలో పడ్డాడు అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తోంది. ఇక ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలు సహా, అత్యంత దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది.
Also Read: ‘చొప్ప దండి’ రివ్యూ: వచ్చే ఎన్నికల్లో గెలుపెవరిది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి?
[…] OKtelugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మౌంటెన్ డ్యూ సాఫ్ట్ డ్రింక్‌ను ప్రమోట్ చేస్తున్న మహేష్ ఈ ఏడాది భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. గతేడాది ఈ బ్రాండ్ నుంచి రూ.7 కోట్లు తీసుకున్న సూపర్ స్టార్ ఈసారి ఏకంగా రూ.5 కోట్లు పెంచి రూ.12 కోట్లు పారితోషికం అందుకోనున్నాడు. సోషల్ మీడియాలోనూ ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేయాల్సి ఉండటంతో ఈ స్థాయిలో డిమాండ్ చేసినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. […]
[…] Puri Jagannadh: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. అందుకే, లైగర్ తర్వాత కూడా విజయ్ దేవరకొండ పూరితోనే మరో సినిమా చేయాలని భావిస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తల పై క్లారిటీ వచ్చింది. ఈ వార్తకు సంబంధించి టీమ్ ఓ ప్రకటనను విడుదల చేసింది. […]