https://oktelugu.com/

Krithi Shetty: సినిమాల్లోకి రాకముందు కృతి శెట్టి ఏం చేసేదో తెలుసా? ఆమె ఫస్ట్ జాబ్ ఏంటంటే?

మూడో చిత్రంగా కృతి శెట్టి బంగార్రాజు చేసింది. విలేజ్ గర్ల్ రోల్ లో అమ్మడు ఆకట్టుకుంది. సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో తెరకెక్కిన బంగార్రాజు 2022 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నాగ చైతన్యకు జంటగా ఆమె నటించారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2023 8:50 am
    Krithi Shetty

    Krithi Shetty

    Follow us on

    Krithi Shetty: కృతి శెట్టి ఉప్పెన మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఉప్పెన బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు, డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్, డెబ్యూ హీరోయిన్ కృతి శెట్టి చేసిన చిత్రం ఇది. విజయ్ సేతుపతి కీలక రోల్ చేశారు. ఉప్పెన అనంతరం కృతి శెట్టి శ్యామ్ సింగరాయ్ మూవీలో నటించింది. అది కూడా మంచి విజయం సాధించింది. నాని హీరోగా నటించారు. సాయి పల్లవి మరొక హీరోయిన్.

    మూడో చిత్రంగా కృతి శెట్టి బంగార్రాజు చేసింది. విలేజ్ గర్ల్ రోల్ లో అమ్మడు ఆకట్టుకుంది. సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో తెరకెక్కిన బంగార్రాజు 2022 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నాగ చైతన్యకు జంటగా ఆమె నటించారు. వరుస విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేసిన కృతి శెట్టికి బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డాయి. బంగార్రాజు తర్వాత చేసిన ఒక్క చిత్రం కూడా సక్సెస్ కాలేదు.

    రామ్ పోతినేనికి జంటగా ది వారియర్ మూవీ చేసింది. ఇది డిజాస్టర్ అయ్యింది. నితిన్ హీరోగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా నిరాశపరిచింది. సుధీర్ బాబు తో చేసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నాగ చైతన్య కస్టడీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రస్తుతం ఆమెకు ఒక హిట్ కావాలి. కాగా కృతి శెట్టి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది, ఆమె ఫస్ట్ జాబ్ ఏమిటో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

    కృతి శెట్టి చిన్నప్పుడు తన అమ్మకు సహాయం చేస్తూ ఉండేదట. ఇంట్లోకి కావలసిన కిరాణా ఐటమ్స్ తెమ్మని కృతి శెట్టికి చెప్పేదట. ఈ పని చేసినందుకు కృతికి వాళ్ళ మదర్ రూ. 50, రూ. 100 ఇస్తూ ఉండేదట. ఇదే నా మొదటి జాబ్ అని కృతి శెట్టి చెప్పింది. కాగా చదువుకునే రోజుల్లో కృతి శెట్టి మోడలింగ్ చేసింది. పార్లీ, ఐడియా, లైఫ్ బాయ్ వంటి ఉత్పత్తుల యాడ్స్ లో నటించింది. సూపర్ 30 సినిమాతో ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది.