Karthikeya Vs Vishwak Sen: హీరో కార్తికేయ కి విశ్వక్ సేన్ కి మధ్య గొడవ ఏంటి..?

కార్తికేయ నేను చేయాల్సిన సినిమాని విశ్వక్ సేన్ ఎలా చేస్తాడు అనే విధంగా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకుముందే విశ్వక్ సేన్ బేబీ సినిమా డైరెక్టర్ విషయంలో ఒక చిన్నపాటి గొడవ పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే.

Written By: Gopi, Updated On : November 9, 2023 8:37 am

Karthikeya Vs Vishwak Sen

Follow us on

Karthikeya Vs Vishwak Sen: సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు ఎప్పుడు పోటీ పడుతూ ఉంటారు. వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ లు కొట్టడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నారు.ఈ ప్రాసెస్ లోనే కొత్త స్టోరీ లను అటెంప్ట్ చేస్తూ తనదైన రీతిలో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో కార్తికేయ వరుసగా సినిమాలు చేస్తూ జనంలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక హీరో గానే కాకుండా కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించి విలన్ గా తన నట విశ్వరూపాన్ని చూపించాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా బెడురులంక అనే సినిమాతో సక్సెస్ సాధించి ఇప్పుడు కొత్త డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే పూరి జగన్నాథ్ దగ్గర ఇస్మార్ట్ శంకర్ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసిన శివ అనే కుర్రాడు కార్తికేయకు చెప్పిన కథ బాగా నచ్చడంతో ఆయన సినిమా చేద్దామని కార్తికేయ ఆ స్టోరీని హోల్డ్ లో పెట్టుకొని కూర్చున్నాడు. ఇక కార్తికేయ స్టోరీ ని పక్కన పెట్టి మిగితా సినిమాలు చేస్తూ అందులో బిజీగా గడుపుతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే శివ అనే అబ్బాయి కార్తికేయ సినిమా చేసే ఉద్దేశ్యం లో లేదు అని అదే స్క్రిప్ట్ ను హీరో విశ్వక్ సేన్ కి చెప్పాడు దాంతో విశ్వక్ సేన్ సినిమాని తెరకెక్కించే పనిలో బిజీ గా ఉన్నాడు.

ఇక దాంతో ఆ విషయం తెలుసుకున్న కార్తికేయ నేను చేయాల్సిన సినిమాని విశ్వక్ సేన్ ఎలా చేస్తాడు అనే విధంగా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకుముందే విశ్వక్ సేన్ బేబీ సినిమా డైరెక్టర్ విషయంలో ఒక చిన్నపాటి గొడవ పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే… మళ్లీ కార్తికేయ తో గొడవ అంటే ఇక విషక్ సేన్ తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశ్యం తో ఆ గొడవ బయటికి రాకుండా లోపల లోపలే పరిష్కరించుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా విశ్వక్ సేన్ చేస్తాడా? కార్తికేయ చేస్తాడా? అనే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు ఇక ఇప్పటికే విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాని చైతన్య కృష్ణ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ సాంగ్స్ బాగుండటం తో ఈ సినిమా మీద ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలైతే నెలకొన్నాయి. ఈ సినిమాతో విశ్వక్ సేన్ మరోసారి మంచి బ్లాక్ బాస్టర్ హిట్టు కొడతాడో లేదో చూడాలి.

ఇక అదే విధంగా ఇప్పుడు కొత్త కుర్రాడు శివ సినిమాలో హీరోగా ఎవరు చేస్తారు అనే దానిపైన సస్పెన్స్ విడాలంటే మరి కొద్దిరోజులు ఆగాలి. ఇక విశ్వక్ సేన్ విషయానికి వస్తే ఈమధ్య ఆయన ఎక్కువ కాంట్రవర్సీలో నిలుస్తున్నాడు. ఓపెన్ గా ఉంటూ ఓపెన్ గా మాట్లాడడం కాంట్రవర్సి లకి కారణం అవుతుందని తెలుస్తుంది…