https://oktelugu.com/

Pawan Kalyan- Shobhan Babu: పవన్ కళ్యాణ్ – శోభన్ బాబు కాంబినేషన్ లో మిస్ అయినా సినిమా ఏమిటో తెలుసా?

Pawan Kalyan- Shobhan Babu: టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ ని మనం కలలో కూడా ఊహించుకోలేం..కానీ అప్పట్లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా మిస్ అయ్యిందా అనే విషయం తెలిసినప్పుడు మాత్రం..’అబ్బా..మంచి సినిమా మిస్ అయ్యిందే’ అని అనుకుంటాము..అలాంటి కాంబినేషన్స్ లో ఒకటే పవన్ కళ్యాణ్ – శోభన్ బాబు గారు కాంబినేషన్..అదేంటి ఈ తరం కథానాయకుడైన పవన్ కళ్యాణ్ తో మొన్నటి తరం సూపర్ స్టార్ శోభన్ బాబు తో సినిమా మిస్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 25, 2022 / 09:06 AM IST
    Follow us on

    Pawan Kalyan- Shobhan Babu: టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ ని మనం కలలో కూడా ఊహించుకోలేం..కానీ అప్పట్లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా మిస్ అయ్యిందా అనే విషయం తెలిసినప్పుడు మాత్రం..’అబ్బా..మంచి సినిమా మిస్ అయ్యిందే’ అని అనుకుంటాము..అలాంటి కాంబినేషన్స్ లో ఒకటే పవన్ కళ్యాణ్ – శోభన్ బాబు గారు కాంబినేషన్..అదేంటి ఈ తరం కథానాయకుడైన పవన్ కళ్యాణ్ తో మొన్నటి తరం సూపర్ స్టార్ శోభన్ బాబు తో సినిమా మిస్ అవ్వడం ఏమిటి..ఇంతకీ ఆ సినిమా ఏమిటి అని అనుకుంటున్నారా..అక్కడికే వస్తున్నాం అండీ!..పవన్ కళ్యాణ్ కెరీర్ లో సుస్వాగతం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..హీరో గా పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొట్టమొదటి సూపర్ హిట్..ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి నాన్న గా రఘువరన్ గారి నటన అద్భుతం..ఆయనకీ మరియు పవన్ కళ్యాణ్ గారికి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు హృదయానికి ఎంతగానో హత్తుకుంటాయి..ఇప్పుడు చూసిన కూడా ఆ సన్నివేశాలకు కంటతడి పెట్టక తప్పదు..అలాంటి సన్నివేశాలు ఈ సినిమాలు ఎన్నో ఉన్నాయి.

    Pawan Kalyan

    పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొట్టమొదటి సూపర్ హిట్ గా నిలిచినా ఈ సుస్వాగతం సినిమాలో తొలుత రఘువరన్ గారి పాత్ర కోసం శోభన్ బాబు గారిని అనుకున్నారట..కానీ ఆయన అప్పటికే సినిమాలు మానేసి ఉన్నారు..కానీ మంచి ఎమోషన్స్ ఉన్న పాత్ర..ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే పాత్ర కావడం తో శోభన్ బాబు గారు ఒప్పుకుంటారు అనుకున్నారు ఆ చిత్ర దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు గారు..దానికి తగ్గట్టే ఆయన అప్పట్లో శోభన్ బాబు గారిని కలిసి ఈ సినిమా ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేసాడు..కానీ శోభన్ బాబు గారు మాత్రం నటించడానికి ఒప్పుకోలేదు.

    Also Read: NTR – ANR – Krishna – Sobhan Babu Remuneration: అప్పట్లో ఎన్టీఆర్ – ANR – కృష్ణ – శోభన్ బాబు ఎంత పారితోషికం తీసుకునేవారో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

    Shobhan Babu

    తాను అభిమానుల దృష్టిలో మరియు ప్రేక్షకుల దృష్టిలో ఎప్పటికి హీరో గానే ఉండాలని..క్యారక్టర్ ఆర్టిస్టుగా వాళ్లకి కనపడకూడదని శోభన్ బాబు గారు చాలా దృడంగా ఉండేవారట..వయస్సు మీద పడడంతో స్టార్ స్టేటస్ కూడా తగ్గిపోయింది..దీనితో ఆయన సినిమాలకు దూరంగా ఉండాలనే అనుకున్నారు..నిర్ణయం మార్చుకోలేదు..ఇలాగే ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన అతడు సినిమాని కూడా రిజెక్ట్ చేసాడు..ఇందులో నాజర్ గారు పోషించిన పాత్ర కోసం శోభన్ బాబు గారిని అడిగారు..దానికి ఆయన నో చెప్పారు..అలా ఈ క్రేజీ కాంబినేషన్స్ అప్పట్లో మిస్ అయ్యాయి.

    Also Read:Amma Rajasekhar – Prabhas: అమ్మా రాజశేఖర్ – ప్రభాస్ కాంబినేషన్ లో మిస్ అయినా సినిమా ఏమిటో తెలుసా ?

    Tags