Homeఎంటర్టైన్మెంట్NTR - ANR - Krishna - Sobhan Babu Remuneration: అప్పట్లో ఎన్టీఆర్ -...

NTR – ANR – Krishna – Sobhan Babu Remuneration: అప్పట్లో ఎన్టీఆర్ – ANR – కృష్ణ – శోభన్ బాబు ఎంత పారితోషికం తీసుకునేవారో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

NTR – ANR – Krishna – sobhan babu Remuneration: టాలీవుడ్ కి మూలస్తంభాలుగా నిలిచినా హీరోలు ఎవరైనా ఉన్నారా అంటే అప్పట్లో ఎన్టీఆర్ మరియు ANR అని చెప్పొచ్చు..వీళ్ళ నుండే సినిమా పుట్టింది..వీళ్ళని ఆదర్శంగా తీసుకొనే ఎంతోమంది ఇండస్ట్రీ కి వచ్చి లెజెండ్స్ అయ్యారు..వేళ్ళని చూసే అసలు నటన అంటే ఏమిటో అందరూ తెలుసుకున్నారు..అలాంటి మహానుభావుల తర్వాత వాళ్లకి దీటుగా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి వచ్చిన హీరో కృష్ణ మరియు శోభన్ బాబు..సూపర్ స్టార్ కృష్ణ గారు ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత పెను మార్పులు సంభవించాయి..ఇండస్ట్రీ కి ఎన్నో కొత్త రకమైన టెక్నాలిజీలు మరియు జానర్ లు పరిచయం చేసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించాడు..ఇక కృష్ణ కి ధీటుగా శోభన్ బాబు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి అగ్ర హీరోగా కొనసాగాడు..సినిమా ఇండస్ట్రీ ని మరో స్థాయికి తీసుకొని వెళ్లిన ఈ నలుగురు పారితోషికాలు అప్పట్లో ఎంత తీసుకునేవారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

NTR - ANR - Krishna - sobhan babu Remuneration
NTR – ANR – Krishna – sobhan babu

ఎన్టీఆర్ గారు అప్పట్లో నెంబర్ 1 హీరో అనే సంగతి మన అందరికి తెలిసిందే..పౌరాణికాలు, సాంఘికాలు అని తేడా లేకుండా ప్రతి జానర్ లో ఆయనకీ తిరుగులేని సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి..అందుకే ఆంధ్రులు ఆయనని ఆరాధ్య దైవం లాగ కొలిచారు..అలాంటి ఎన్టీఆర్ కి అప్పట్లో ఒక లక్ష రూపాయిలు పారోతోషికం గా ఇచ్చేవారట..లక్ష రూపాయిలు కదా అని తీసిపారేయకండి..ఆరోజుల్లో ఒక భారీ బడ్జెట్ సినిమా విలువే 5 లక్షల రూపాయిలు ఉంటుంది.

Also Read: Amma Rajasekhar – Prabhas: అమ్మా రాజశేఖర్ – ప్రభాస్ కాంబినేషన్ లో మిస్ అయినా సినిమా ఏమిటో తెలుసా ?

భారీ బడ్జెట్ సినిమా అంటే ప్రస్తుత రోజుల్లో ఎంత తక్కువ వేసుకున్న 100 కోట్ల రూపాయలకు తగ్గదు..ఆరోజుల్లో 5 లక్షల రూపాయిల బడ్జెట్ అంటే వందల కోట్ల రూపాయలతో సమానం..ఈ లెక్కన ఎన్టీఆర్ పారితోషికం లక్ష రూపాయిలు..అంతే ఆయన రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు..ఆయన ఆఖరి చిత్రం మేజర్ చంద్రకాంత్ కి దాదాపుగా కోటి రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు..మొట్టమొదటి కోటి రూపాయిల రెమ్యూనరేషన్ అందుకున్న హీరో ఎన్టీఆర్..ఇక తర్వాత నాగేశ్వరరావు గారు అప్పట్లో లక్ష రూపాయిలు పారితోషికం తీసుకునేవారు.

NTR - ANR - Krishna - sobhan babu Remuneration
NTR – ANR – Krishna

ఇక్కడ ‘అప్పట్లో’ అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు నడుస్తున్న కాలం లో అన్నమాట..కృష్ణ మరియు శోభన్ బాబు వంటి నటులు కలర్ సినిమాకి అప్డేట్ అయ్యింది..కలర్ కి అప్డేట్ అయినా తర్వాత ఎన్టీఆర్ మరియు ANR వంటి వారు 5 లక్షల రూపాయిలు పారితోషికం అందుకునే వారు..ఇక కృష్ణ శోభన్ బాబు వంటి వారు కూడా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో వేరే లెవెల్ కి వెళ్లడం తో వాళ్ళు కూడా ఎన్టీఆర్ – ANR రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునేవారు..చిరంజీవి దశకం ప్రారంభం అయ్యే రెండు మూడు సంవత్సరాల ముందు ఈ నలుగురు హీరోలు 50 లక్షల రూపాయిల పారోతోషికం అందుకునే రేంజ్ వరుకు వెళ్లారు..కానీ కోటి రూపాయిలు అందుకున్న మొట్టమొదటి హీరో మాత్రం ఎన్టీఆర్ గారే..ఇక ఆ తర్వాత చిరంజీవి గారు ఆ రేంజ్ కి వెళ్లారు.

Also Read:Vishnu Vishal Nude Pic: రణ్ వీర్ తర్వాత నగ్నంగా మరో హీరో.. ఏంటీ బహిరంగ ‘బరివాత’ యవ్వారం?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version