KCR New Plan: కేసీఆర్ అంతరంగం అంతుచిక్కడం లేదు.టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా మాట్లాడిన కేసీఆర్ తీరు చూస్తే త్వరలో ఏం చేయబోతున్నారనే దానిపై ఓ క్లారిటీకి ఎవరూ రావడం లేదు. నిన్నా మొన్నటివరకూ థర్డ్ ఫ్రంట్ అన్న కేసీఆర్ సడెన్ గా ఇప్పుడు కూటములతో పని కాదని.. ప్రత్యామ్మాయ ఎజెండానే కావాలని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. మిగతా పార్టీలతో కలవరకుండా జాతీయ రాజకీయాల్లో రాణించడం అంటే అది అంత ఈజీ కాదు. దీంతో కేసీఆర్ ఏం చేయబోతున్నారు? ఆయన ప్లాన్ ఏంటన్నది ఆసక్తిగా మారింది.
కేసీఆర్ ప్లీనరీలో ప్రతిపాదించిన ప్రత్యామ్మాయ ఎజెండా ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై దేశ ప్రజలు ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అర్థం కావంటారు. ఆయన ఏ వ్యూహంలో సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారో కూడా ఎవరికీ అంతుబట్టడం లేదు. దీంతో గులాబీ బాస్ ప్రకటన వెనుక ఏదైనా ప్లాన్ ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Elon Musk Twitter: కోకా-కోలాను కొనబోతున్నా.. మా కోసం చంద్రుడిని కూడా కొనండి !
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం కన్ఫమ్. అయితే ఇప్పుడే అధికారంలో ఉన్నప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లేబదులు.. మరోసారి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించి.. కేటీఆర్ ను సీఎం చేసి అప్పటి రాజకీయ పరిస్థితులను దేశంలో చూసి అడుగులు వేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం కొన్ని నెలల కోసం ఇప్పుడే కేటీఆర్ ను సీఎం చేసే బదులు మరోసారి టీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చాక ఐదేళ్లు ఇవ్వడమే బెటర్ అని కేసీఆర్ భావిస్తున్నారు.
ఈ మేరకు త్వరలోనే మేధావులు, విద్యావేత్తలతో సదస్సు నిర్వహించి దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై ఎజెండా రూపొందిస్తామని కేసీఆర్ ప్లాన్ గా తెలుస్తోంది. ముందుగా దేశ రాజకీయాల్లోకి వెళ్లేముందు తెలంగాణలో గెలవడం కేసీఆర్ కు తప్పనిసరి.ఇంట గెలిచి రచ్చ గెలవాలని.. ఇక్కడ బలం ఉంటేనే అక్కడ కేసీఆర్ పోరాడగలరు. అందుకే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సైతం కేసీఆర్ వెళ్లవచ్చన్న చర్చసాగుతోంది.
ఈ మేరకు ప్రజలను సిద్ధం చేయడానికి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ముందస్తు కోసం బలమైన కారణాలను వెతుకుతున్నారని సమాచారం. ఈ ఏడాది చివర్లోనే గుజరాత్ , కర్ణాటక ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల సమయంలోనే తెలంగాణలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. మరి కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆశలు నెరవేరుతాయా? ఆయన మళ్లీ తెలంగాణ లో అధికారంలోకి వస్తాడా? అన్నది వేచిచూడాలి.
Also Read:KCR- Jagan: కేసీఆర్ నల్గొండకు.. జగన్ విశాఖకు.. కీలక పర్యటనలు