Nikita Thukral: సినిమా అనే రంగుల ప్రపంచంలో కంటిన్యూ అవడం కష్టమేనండోయ్.. అందం ఒకటే ఉంటే సరిపోదు. అలా అని అదృష్టంతో గట్టెక్కవచ్చా అంటే ప్రతిసారి కుదరదు. పోని ప్రతిభ ఉంటే చాలా అంటే ఒక్క ప్రతిభతో ఇండస్ట్రీలో కంటిన్యూ అవడం కష్టమే. అందుకే ప్రతిభ, అదృష్టం రెండూ ఉండాలి. ఇక హీరోయిన్ లకు అయితే అందం మస్ట్. లేదంటే ఇండస్ట్రీ నుంచి ఔట్ అవ్వాల్సిందే. ఇక హీరోలకు ఫిట్ నెస్ పక్కా.
ఇదంతా మాకు ఎందుకు అనుకుంటున్నారా? ఓ హీరోయిన్ ఇలాగే ఒకప్పుడు ఓ మెరుపు మెరిసి ప్రస్తుతం సైలెంట్ అయింది.. ఇంతకీ ఎవరంటే..నిఖిత టక్రాల్ గుర్తుందా.. అదేనండి ఒకప్పుడు స్టార్ హీరోలతో జతకట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. 2002లో వచ్చిన హాయ్ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత వేణు, ప్రభుదేవాలతో నటించింది. కళ్యాణ రాముడు, నితిన్ నటించిన సంబరం, జగపతి బాబు నటించిన ఖుషీ ఖుషీగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
తమిళ, మలయాళ, కన్నడ భాషలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ అమ్మడు. అంతేకాదు పునీత్ రాజ్ కుమార్, ఫహద్ ఫాజిల్, దర్శన్ వంటి పెద్దపెద్ద హీరోల సరసన జతకట్టింది. ఈ ఇండస్ట్రీ తర్వాతనే ఈమెకు తెలుగులో ఎక్కువ ఆఫర్లు వచ్చాయి. టాలీవుడ్ లో ఏవండోయ్ శ్రీవారు, ఆగంతకుడు, అవును 2, టెర్రర్, మహారాజశ్రీ నీ నవ్వే చాలు అంటూ మొత్తం 14 సినిమాల్లో నటించింది. ఇలా సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే అంటే 2017లో గంగ దీప్ సింగ్ మగోను మనువాడింది.
పెళ్లి తర్వాత సినిమాల్లో చేయవద్దు అని డిసైడ్ అయిందో.. లేదా భర్త వద్దన్నాడో తెలియదు కానీ ఇండస్ట్రీకి దూరమైంది. చివరగా ఒకే ఒక కన్నడ సినిమాలో అదేనండి రాజసింహ అనే సినిమాలో నటించింది. తర్వాత మరే సినిమాలో కనిపించలేదు. ఆరేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది అమ్మడు. మధ్యలో ఒకసారి కన్నడ బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొని రన్నర్ గా నిలిచింది. ఈమెకు ఓ కూతురు కూడా ఉంది. తరచూ కూతురు తో ఉన్న ఫోటోలు, వీడియోలను కూడా చేస్తూ ఉంటుంది నిఖిత.
View this post on Instagram