Mohan Babu On Chiranjeevi: మెగాస్టార్ గా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న చిరంజీవి ఒకప్పుడు జనం మెచ్చే మాస్ సినిమాలను ఎక్కువగా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను అయితే ఏర్పాటు చేసుకున్నాడు…ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా మీద మొదటి నుంచి మంచి అంచనాలు ఉండేవి ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి చాలా సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు మిగతా హీరోల కంటే కూడా ఆయన చేసే సినిమాలు చాలా వైవిధ్యంగా ఉంటాయంటూ పేరైతే సంపాదించుకున్నాడు.
అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ చిరంజీవి సినిమాలు చూడడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్ని కలిసి ఉంటాయి కాబట్టి ఈ సినిమాలు చూడడానికి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడేవారు. అయితే వరుస సినిమాలు చేసుకుంటూ చిరంజీవి ముందుకు దూసుకెళ్ళాడు.ఇక ఈ క్రమంలో ఒకానొక సందర్భంలో చిరంజీవి ఫ్లాపుల్లో ఉన్నప్పుడు హిట్లర్ అనే సినిమాతో మరొకసారి తన పంజాను ఇండస్ట్రీకి రుచి చూపించి మంచి సక్సెస్ ని అందుకున్నాడు.
అయితే ఈ సినిమా మొదట మోహన్ బాబు దగ్గరికి వెళ్లిందట. ఆయన దగ్గరికి ఈ కథ వెళ్ళినప్పుడు మోహన్ బాబు తనకి ఈ కథ సెట్ అవదు చిరంజీవికి అయితే బాగా సెట్ అవుతుందని డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య తో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య చిరంజీవిని కలిసి ఈ కథ చెప్పి సినిమాని తీసి సక్సెస్ కొట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది మలయాళ రీమేక్ సినిమా అయినప్పటికీ దీన్ని తెలుగుకు తగ్గట్టుగా చాలా మార్పులు చేర్పులు చేశారు అయితే ఈ సినిమాతో చిరంజీవి సక్సెస్ ట్రాక్ ఎక్కి వరుసగా సక్సెస్ సినిమాలు చేస్తూ వచ్చాడు. అలా చిరంజీవికి మోహన్ బాబు ఒకరకంగా మేలు చేశారనే చెప్పాలి.
ఇలా చిరంజీవి హిట్లర్ సినిమా చేసి సక్సెస్ అందుకొని ఆ తర్వాత మాస్టర్, చూడాలని ఉంది లాంటి వరుస సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ వచ్చాడు…ఇక ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి…ఇక ఈ సినిమాతో మరొక సక్సెస్ కొట్టడానికి చిరంజీవి రెఢీ అవుతున్నట్టు గా తెలుస్తుంది…