Gold Prices: బంగారం కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కొన్ని రోజులుగా అందనంత ఎత్తుకు పెరిగిన పసిడి ధరలు రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. అలాగే వెండి ప్రియులకు గుడ్ న్యూస్. ఏకంగా రూ.2000 వరకు ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా డాలర్ బలపడుతున్నా.. బంగారం ధరలు తగ్గడం ఊరటనిస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ఔన్స్ కు 2040 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ రేటు 23 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 5న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,380 గా ఉంది. జనవరి 4న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,500తో విక్రయించారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు రూ.400 మేరకు తగ్గాయి. రెండు రోజులుగా బంగారం ధరలు రూ.600 తగ్గడం విశేషం. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,530గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,100 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.63,380 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,700 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.64,040తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,100 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,380తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,100తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,380తో విక్రయిస్తున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76,600గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం వెండి ధరలు రూ.2000 మేరకు తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,600గా ఉంది. ముంబైలో రూ.76,600, చెన్నైలో రూ.78,000, బెంగుళూరులో 75,000, హైదరాబాద్ లో రూ.78,000తో విక్రయిస్తున్నారు.