Bigg Boss 7 Telugu: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని చాలా మంది హీరోలు తమ సత్తా చాటారు. ఇప్పుడున్న వారిలో ఎక్కువగా వారసత్వంతో వచ్చిన వారు ఉండగా.. ఒకప్పుడు అలాంటి అవకాశం ఉండేది కాదు. దీంతో తమ ప్రతిభ ఆధారంగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. అలాంటి వారిలో శివాజీ ఒకరు. మొదట్లో సైడ్ పాత్రల్లో కనిపించిన ఈయన ఆ తరువాత మెయిన్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. ఓ వైపు సినిమాల్లో రాణిస్తూ.. మరోవైపు రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు. లేటేస్టుగా బిగ్ బాస్ హౌస్ సీజన్ 7లోకి అడుగుపెట్టిన ప్రత్యేకంగా నిలుస్తున్నారు.ఈ సందర్భంగా శివాజీ సతీమణి గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
గుంటూరు జిల్లా గొరిజవోలుకు చెందిన శివాజీ డిగ్రీ పూర్తయిన తరువాత ఉద్యోగం కోసం హైదరాబాద్ కు మారాడు. సినిమాల్లో అవకాశాల కోసం ముందుగా నిర్మాత కేఎస్ రామారావు దగ్గర ఎడిట్ షూట్ లో పనిచేశాడు. ఆ తరువాత చిరంజీవి హీరోగా వచ్చిన ‘మాస్టర్’ అనే సినిమాలో శివాజీకి చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఇందులో శివాజీ చెప్పులు లేకుండా పరుగెత్తడం చూసి చిరు షూస్ కొనిస్తాడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఆ తరువాత అయనకు అవకాశాలు పెరిగాయి. అయితే అంతకుముందే ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ అనే సినిమాలో హీరో స్నేహితుడి పాత్రలో నటించాడు.
ఆ తరువాత పలు సినిమాల్లో హీరోగా నటించిన ఆయన ఎమోషన్, యాక్షన్, కామెడీ.. ఇలా ఏ పాత్రలోనైనా నటించి మెప్పించాడు. సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు శివాజీ. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆయన బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పర్సనల్ విషయాలపై ఆసక్తి చర్చ సాగుతోంది. అందరిలాగా శివాజీ తన పర్సనల్ విషయాలను ఎప్పుడూ బయటపెట్టలేదు.
శివాజీ భార్య పేరు శ్వేతా గౌడ్. నిజామాబాద్ కు చెందిన ఈమె ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తొడల్లుడు కూతురు. రాజకీయ నేపథ్యం ఉన్న ఈ అమ్మాయి అయినా శివాజీ ఈమె దగ్గర నుంచి కట్నం అస్సలు తీసుకోలేదట. శివాజీ సినిమాల్లోకి రాకముందు ఆమెకు హీరోయిన్ కావాలని ఉండేదట. అయితే శివాజీతో పరిచయం అయి, అతడిని పెళ్లి చేసుకున్న తరువాత సినిమాల గురించి ఆలోచించడం మానేసిందట. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరిలో పెద్దకొడుకు శ్రీ కాగా.. రెండో కొడుకు వెంకట్. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ కుటుంబాలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈ సందర్భంగా శివాజీ కుటుంబం కూడా రానుంది. *