Prashanth Neel On NTR: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఇంట్లో ఇచ్చిన ఎన్టీఆర్ చాలా తక్కువ సమయం లోనే మంచి విజయాలను అందుకుని తాతకు తగ్గ మనవడిగా మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఆయనని మాస్ హీరోగా నిలబెట్టాయి.ఇక ఈ క్రమంలోనే ఆయన టెంపర్ సినిమా నుంచి మొన్న వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా వరకు వరుసగా 6 సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వం వస్తున్న దేవర సినిమాతో మరొక సక్సెస్ కొట్టడానికి మన ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనుల్లో ఎన్టీఆర్ బిజీ గా ఉన్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ కి సలార్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా కే జి ఎఫ్, సలార్ లా మాదిరిగానే డార్క్ మూడు లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ తోపాటు ఎన్టీఆర్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఎన్టీయార్ తన క్యారెక్టర్ డిజైన్ లో ప్రశాంత్ నీల్ కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేది ప్రశాంత్ నీల్ డిజైన్ చేస్తున్న క్రమంలో ఎన్టీఆర్ వాటికి సంబంధించిన కొన్ని సలహాలను ఇచ్చినట్టుగా ఇప్పుడు చిత్ర యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇక దీంట్లో కూడా ఎన్టీఆర్ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. సలార్ లో ప్రభాస్ ని ఎలివేషన్స్ తో ముంచెత్తిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని ఎలాంటి రోల్ చూపిస్తాడు అలాగే ఎన్టీయార్ అభిమానులు ఇష్టపడేలా ఎలా చూపిస్తాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్ టాప్ త్రీ లో నిలవడం విశేషం… ఇక ఈయన వరుసగా తెలుగు హీరోలతో సినిమాలు చేయడం గ్రేట్ అనే చెప్పాలి…