Director Shouryuv: హాయ్ నాన్న డైరెక్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

హాయ్ నాన్న సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ పేరు శౌర్యువ్. ఇందులో ఎమోషనల్ సీన్స్ వల్ల అందరి దృష్టి ఈ డైరెక్టర్ వైపు మళ్లింది.

Written By: Suresh, Updated On : December 16, 2023 12:09 pm

Director Shouryuv

Follow us on

Director Shouryuv: ఈ మధ్య నాచురల్ స్టార్ నాని నటించిన సినిమాలు మంచి హిట్ ను సంపాదిస్తున్నాయి. ఇక ఈయన కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడంలో ముందుంటారు. మరి రీసెంట్ గా నాని హీరోగా వచ్చిన సినిమా ఏంటి అనుకుంటున్నారా? అదే నండి హాయ్ నాన్న.. ఈ సినిమాలో తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని చూపిస్తూ.. సూపర్ హిట్ ను సంపాదిస్తున్నారు. అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ గురించి ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? ఇంతకుముందు ఎక్కడ పని చేశారు అనే వివరాలు మీకోసం..

హాయ్ నాన్న సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ పేరు శౌర్యువ్. ఇందులో ఎమోషనల్ సీన్స్ వల్ల అందరి దృష్టి ఈ డైరెక్టర్ వైపు మళ్లింది. అయితే ఈయనకు ఇదే మొదటి సినిమా అని తెలిసి మరింత ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఇక ఈ డైరెక్టర్ కు ఈ సినిమా మొదటిది.. కానీ ఇండస్ట్రీలో ఎనిమిది సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ వద్ద అసిస్టెంట్ రైటర్ గా పని చేశారు. జాగ్వార్, బజరంగీ భాయిజాన్ 2, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలకు రైటర్ గా పని చేసిన అనుభవం ఉంది.

ఒక హిందీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారట ఈయన. అంతేకాదు తెలుగులో హిట్ ను అందుకున్న అర్జున్ రెడ్డి సినిమాకు తమిళంలో పని చేశారట. అయితే అనుకోకుండా అదృష్టం వరించి కథలు రాసుకోవడం.. వెనువెంటనే ప్రొడ్యూసర్లను కలవడం.. వారు ఒకే చేయడం కూడా అయిపోయిందట. దీంతో ఈయన డైరెక్టర్ గా మొదటి సినిమాతోనే హిట్ ను అందుకున్నారు. హాయ్ నాన్న సినిమా హిట్ తో తెలుగు ఇండస్ట్రీ దృష్టి ఇప్పుడు ఈ డైరెక్టర్ వైపే మళ్లింది. ఇక ముందు ముందు ఈయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి..