Samantha Assets: మనకు తెలిసినంత వరకు సినీ సెలబ్రిటీల మీద వచ్చినన్ని రూమర్లు, వార్తలు మరెవ్వరి మీద రావేమో కదా. వారి గురించి ఏ చిన్న గాసిప్ వినిపంచినా సరే అది నిజమే అన్నట్టు ప్రచారం చేసేస్తుంటాయి మీడియా సంస్థలు. ఇక స్టార్ హీరోయిన్, హీరోల మీద అయితే లెక్కలేనన్ని రూమర్లు వస్తుంటాయి. వారి రెమ్యునరేషన్, ఆస్తుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక సమంత విషయంలో కూడా ఇలాంటి రూమర్లు ఎన్నో వినిపించాయి. చైతన్యతో విడిపోయిన తర్వాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఆమె నాగచైతన్య నుంచి వందల కోట్ల భరణం తీసుకుందని ప్రచారం జరిగింది. దాదాపు రూ.200 కోట్లు చైతన్య ఆమెకు ఇచ్చాడనే వార్త ఇప్పటికీ వైలర్ అవుతూనే ఉంది. కానీ వాస్తవానికి ఆమె దగ్గర పెద్దగా ఆస్తులు ఏమీ లేవు.
ఆమె చైతన్య దగ్గరి నుంచి ఎలాంటి డబ్బు, ఆస్తులు తీసుకోలేదని సమాచారం. పంతానికి పోయి ఉన్నది కూడా పోగొట్టుకుందంట. ఇప్పుడు ఆమె చైతన్య కొన్న ఫ్లాట్‌లో కూడా ఉండట్లేదు. హైదరాబాద్ లోనే అద్దె ప్లాట్ లో ఉంటుంది. చైతన్యతో మ్యారేజ్ కాక ముందు కూడా ఆమెకు పెద్దగా ఆస్తులు ఏమీ లేవు. అప్పట్లో పెద్దగా రెమ్యునరేషన్లు కూడా లేవు కాబట్టి పెద్దగా వెనకేసుకోలేదంట.
Also Read: Samantha: అలా ఉంటే.. కోరుకున్నవన్నీ దరి చేరుతాయి – సమంత
పైగా ఒకర్ని నమ్మి మోసపోవడంతో ఆస్తులు కరిగిపోయినట్టు తెలుస్తోంది. చైతన్య, సమంత కలిసి ఉన్న ఇల్లును చెయ్ అమ్మేస్తున్నాడంట. దాన్ని అమ్మి జూబ్లీ హిల్స్ ప్రాంతంలో అత్యంత ఖరీదైన సొంతింటిని కట్టుకుంటున్నాడంట చైతన్య. కానీ సమంత మాత్రం అద్దె ఇంట్లోనే కాలం గడుపుతోంది. ఆమెకు హైదరాబాద్ లో ఒక అపార్టుమెంట్, చెన్నైలో ఒకటి ఉన్నాయి. వాటి వల్ల రెంట్లు పెద్దగా ఏమీ రావట్లేదు.
కాకపోతే హైదరాబాద్ లోనే ఉన్న ఎస్ఎల్ఎన్ క్లాంప్లెక్స్ లో సామ్‌కు ఓ మంచి ప్రాపర్టీ ఉందంట. దాంతోనే ఆమెకు అంతో ఇంతో కలిసొస్తుందంట. దానికంటే పెద్ద ఆస్తులు ఏమీ లేవని తెలుస్తోంది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా కూడా పెద్ద ఆఫర్లు ఏమీ రావట్లేదు. శాకుంతల, యశోద మూవీల్లో ఆమె నటిస్తోంది. అయితే స్టార్ హీరోల సరసన ఆఫర్లు వస్తే మాత్రం చేయడానికి రెడీగా ఉంది. కానీ టాలీవుడ్‌లో స్టార్ హీరోలు ఆమెకు చాన్స్ ఇచ్చే అవకాశం అయితే లేదని తెలుస్తోంది.
Also Read: మహేశ్, నమ్రతల లవ్ ఎక్కడ మొదలైందో తెలుసా.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే..?