Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ అంటే మజా.. ఈ రియాలిటీ షోను జనాలు విపరీతంగా ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. ఇదివరకూ గంట సేపు చూస్తేనే పిచ్చెక్కిపోయిన జనానికి ఇప్పుడు ఓటీటీ వేదికగా 24 గంటలూ లైవ్ చూసేసరికి మరింతగా ఫిదా అవుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రతి వీకెండ్ కు నాగార్జున వచ్చి వారి తప్పులు ఎత్తిచూపి వారిని సరైన దారిలో పెడుతూ హెచ్చరిస్తూ షోను మరింతగా ముందుకు తీసుకెళుతున్నాడు. ఈ ఆదివారం కూడా బిగ్ బాస్ లో నాగార్జున సందడి చేశాడు. ఈ సందర్భంగా కొందరికి క్లాస్ పీకాడు.
బిగ్ బాస్ లోని లేడి కంటెస్టెంట్లకు నాగార్జున ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ హౌస్ లో ఈ షో జరిగేంత సేపూ బట్టలు లేకుండా నగ్నంగా ఒకరిని నిలబెట్టాలనుకుంటున్నానని.. ఎవరో మీరే సెలెక్ట్ చేయండని నాగార్జున లేడి కంటెస్టెంట్లకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే తేజస్వి లాంటి హాట్ బాంబ్ ‘సార్.. ఇక్కడున్న వాళ్లకంటే మీరే షర్ట్ విప్పేసి నిలబడితే చూడాలని ఉంది’ అంటూ కొంటె ప్రశ్న వేసింది.
దీనికి నాగార్జున అంతే సరదాగా నవ్వి ఊరుకున్నాడు. ఇక లేడి కంటెస్టెంట్లు అంతా శివకు సిగ్గు ఎక్కువ అని అతడే నగ్నంగా నిలబడాలని కోరారు. శివ తటపటాయిస్తుంటే మిగతా కంటెస్టెంట్లు అంతా కలిసి అతడి షర్ట్ విప్పి నగ్నంగా నిలబెట్టారు.
ఇలా బిగ్ బాస్ ఓటీటీలో ముందే చెప్పినట్టు కాస్త రోమాన్స్, హాట్ నెస్ ఎక్కువేనని నిన్నటి షో ద్వారా బహిర్గమైంది.
Also Read: Bigg Boss Non Stop: బిగ్ బాస్ లో అసభ్యకరమైన సీన్.. పూల్ లో సరసాలు
Recommended Video:


[…] […]