https://oktelugu.com/

Karthika Deepam 2: రావడంతోనే బుల్లితెరను కుమ్మేస్తున్న వంటలక్క.. కార్తీక దీపం 2 టీఆర్పీ రేటింగ్ ఎంతో తెలుసా?

దీప - కార్తీక్ ఎప్పుడు కలుస్తారని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. రోజుకో మలుపు తిప్పుతూ సీరియల్ ని ఏళ్ల తరబడి టాప్ రేటింగ్ లో నిలబెట్టారు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 5, 2024 / 05:17 PM IST

    Karthika Deepam 2 TRP Rating

    Follow us on

    Karthika Deepam 2: కార్తీకదీపం సీరియల్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రికార్డు స్థాయిలో రేటింగ్ నమోదు చేసి దేశంలో నంబర్ వన్ సీరియల్ గా నిలిచింది. దాదాపు ఆరేళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. దీపని కార్తీక్ అనుమానించడం, అపార్ధం చేసుకొని దూరం పెట్టడం. వంటలక్క నిజాయితీ నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ విఫలం అవ్వడం. ఈ స్టోరీ లైన్ పెట్టుకుని ఏళ్ల తరబడి సీరియల్ నడిపించేశాడు డైరెక్టర్ కాపు గంటి రాజేంద్ర.

    దీప – కార్తీక్ ఎప్పుడు కలుస్తారని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. రోజుకో మలుపు తిప్పుతూ సీరియల్ ని ఏళ్ల తరబడి టాప్ రేటింగ్ లో నిలబెట్టారు. గత ఏడాది కార్తీకదీపం సీరియల్ కి ఎండ్ కార్డు పడింది. ఇక రీసెంట్ గా కార్తీకదీపం 2 ఇది నవ వసంతం అంటూ ప్రారంభించారు. టైటిల్ కి తగ్గట్టుగానే పూర్తిగా ఇది కొత్త కథ. ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

    కాగా ఈ పార్ట్ 2 కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతుంది. సీరియల్ మొదలైన మొదటి వారంలోనే రేటింగ్ దుమ్ముదులుపుతుంది. స్టార్ మాలో ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ టాప్ లో ఉంది. కాగా కార్తీక దీపం గట్టి పోటీ ఇస్తోంది. తన పాత రికార్డులని గుర్తు చేస్తూ .. తొలివారంలోనే 12. 93 రేటింగ్ సాధించింది. మరోసారి నంబర్ వన్ సీరియల్ గా నిలిచింది. అర్బన్ లో 10.40 .., అర్బన్ ఇంకా రూరల్ కలిసి 12.93 టీఆర్పీ సాధించింది.

    కార్తీకదీపం 2 సీరియల్ రోజు రోజుకి ఆసక్తిగా సాగుతుంది. దీప పుట్టుక నుంచి చూసుకుంటే .. దీప భర్త ఎవరు? దీప, సౌర్య లను ఎందుకు వదిలేసాడు? కార్తీక్ – దీప మధ్య ఉన్న సంబంధం ఏంటి .. కార్తీక్ ని ఎందుకు అపార్ధం చేసుకుంటుంది ఇలా ప్రతి అంశం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీంతో సీరియల్స్ ఫ్యాన్స్ కార్తీకదీపం 2 ని బాగా ఆదరిస్తున్నారు. తొలి వారంలోనే ఈ స్థాయిలో రేటింగ్ ఉదంటే,మున్ముందు బ్రహ్మముడి సీరియల్ ని వెనక్కి నెట్టి కార్తీకదీపం 2 ఫస్ట్ ప్లేస్ లో నిలవడం ఖాయం.