Mahesh- Trivikram Movie Title: మహేష్ బాబు లేటెస్ట్ మూవీ టైటిల్ పై రోజుకో పుకారు తెరపైకి వస్తుంది. మొత్తంగా ఐదారు టైటిల్స్ వినిపిస్తున్నాయి. వీటిలో మూడు టైటిల్స్ ని చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుంటూరు కారం, అమరావతికి అటు ఇటు, ఊరికి మొనగాడు టైటిల్స్ లో ఒకటి ఫిక్స్ చేయనున్నారట. త్వరలో కృష్ణ జయంతి. ఆ రోజున టైటిల్ పోస్టర్ విడుదల చేయాలనేది మేకర్స్ ఆలోచన. త్రివిక్రమ్ టైటిల్స్ చాలా భిన్నంగా ఉంటాయి. క్లాస్ గా ఉంటాయి. ఈ జనరేషన్ టైటిల్స్ లా ఉండవు. మహేష్ కోసం ఏ టైటిల్ ఫిక్స్ చేస్తాడో చూడాలి.
షూటింగ్ కి బ్రేక్ రావడంతో ఇటీవల మహేష్ స్పెయిన్ వెళ్ళాడు. ట్రిప్ ముగించుకుని మహేష్ హైదరాబాద్ లో అడుగుపెట్టారు. జూన్ మొదటి వారం నుండి ఎస్ఎస్ఎంబి 28 షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. అందుకే మహేష్ హైదరాబాద్ కి రావడం జరిగింది. జూన్ నుండి నిరవధికంగా మూడు నెలలు షూటింగ్ ప్లాన్ చేశారట. విడుదల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రీకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ ఆలోచన.
2024 సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల చేయనున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్-మహేష్ దశాబ్దం అనంతరం కలిసి సినిమా చేస్తున్నారు. ఇద్దరికీ విబేధాలు తలెత్తాయనే ప్రచారం జరిగింది.
మరోవైపు రాజమౌళి మహేష్ 29వ చిత్ర ప్రీ ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. ఈ ఏడాది చివర్లో రాజమౌళి-మహేష్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. రాజమౌళి కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. దాదాపు రూ. 800 కోట్లు అనుకుంటున్నారట. ఇది జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ అట. హాలీవుడ్ సాంకేతిక నిపుణులను రాజమౌళి రంగంలోకి దింపుతున్నారట. హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో మహేష్ మూవీ రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.