https://oktelugu.com/

Chiranjeevi: కెరియర్ మొదట్లో చిరంజీవి కి హెల్ప్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశ్యంతో ఉన్నఫలంగా ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి ఇక్కడ మెగాస్టార్ గా ఎదిగి గొప్ప గుర్తింపును సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు.

Written By:
  • Neelambaram
  • , Updated On : March 19, 2024 / 12:03 PM IST

    Chiranjeevi about Krishnam Raju

    Follow us on

    Chiranjeevi: ఒక సాధారణ వ్యక్తి సినిమాల్లో నటించడం అంటే అంత ఈజీ కాదు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ, ఎంతో కృషి , ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుంది. ఇక అవన్నీ చేసిన తర్వాత ఏదో ఒక చిన్న ఛాన్స్ వస్తే దాన్ని సద్వినియోగపరుచుకొని సినిమా అవకాశం వచ్చేలా తనని తాను ప్రూవ్ చేసుకుంటే తప్ప ఇక్కడ నటులుగా రాణించాలేం అనేది మాత్రం వాస్తవం… అందుకే ఎక్కువమంది సినిమా ఇండస్ట్రీకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపించరు.

    ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశ్యంతో ఉన్నఫలంగా ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి ఇక్కడ మెగాస్టార్ గా ఎదిగి గొప్ప గుర్తింపును సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో కృష్ణంరాజు చిరంజీవికి కొన్ని విషయాల్లో హెల్ప్ చేశారట. వీళ్ళిద్దరిది ఒకే ఊరు కావడం వల్ల అలాగే ముందు నుంచి కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులు కావడం వల్ల చిరంజీవికి కృష్ణంరాజు సినిమాలపరంగా కొద్దిగా హెల్ప్ అయితే చేశారని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి… కృష్ణంరాజు చిరంజీవికి ఆఫీసుల అడ్రస్ లు చెప్పు వాళ్లను కలువమని సినిమా అవకాశాల కోసం కొంతమంది దగ్గరికి పంపించేవాడట. చిరంజీవి కూడా కృష్ణంరాజు గారు చెప్పినట్టుగా వింటూ సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలను దక్కించుకున్నాడు.

    ఇక మొత్తానికైతే వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందారు… ఇక కృష్ణంరాజు గత సంవత్సరం అనారోగ్య కారణంగా మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం చిరంజీవి మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఇప్పటికీ మెగాస్టార్ గా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు.

    ఈ సినిమాతో మరోసారి మెగాస్టార్ తన పంజా దెబ్బని మరోసారి రుచి చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో చిరంజీవి ఫుల్ ఫామ్ లోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక గత సినిమా అయిన భోళా శంకర్ సినిమాతో భారీ ఫ్లాప్ ని అందుకున్న చిరంజీవి ఈ సినిమా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు…