https://oktelugu.com/

Alcohol : సురాపానం ఏదైనా కానీ.. తాగేటోళ్లకే దాని విలువ తెలుస్తుంది..

పాశ్చాత్య దేశాలలో వైన్ ను పొడవైన కుప్పె, దాని కింద సన్నటి నిర్మాణం.. అడుగు భాగంలో వెడల్పాటి ఆకృతిలో ఉన్న గాజు గ్లాసులో తాగుతారు. బీర్ అయితే గాజు జగ్గులో స్వీకరిస్తారు. రమ్ అయితే దీర్ఘ చతురస్రాకారపు గాజు గ్లాసులో పోసుకుని తాగుతారు..

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2024 / 12:00 PM IST

    jumbo glass

    Follow us on

    Alcohol : వేడి వేడి చాయ్ ని చిన్న గ్లాసులో తాగుతాం. మంచినీళ్లను పెద్ద గ్లాసులో తాగుతాం. అదే ఏదైనా మద్యానికి సంబంధించి అయితే జంబో గ్లాస్.. మద్యంలో చాలా రకాలుంటాయి. వాటి ఆధారంగానే గ్లాసులను ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ మనదేశంలో మద్యం ప్రియులు అలా కాదు.. అది ఎలాంటి మద్యమైనా సరే జంబో గ్లాస్ ఉండాల్సిందే. ఏదైనా అందులోనే.. దాని ద్వారానే.. ఈ విషయం ఓ నెటిజన్ కు వింతగా తోచింది. ఇంకేముంది వివిధ దేశాల పరిస్థితులను అన్వయిస్తూ ఒక మీమ్ రూపొందించాడు. అది దెబ్బకు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

    పాశ్చాత్య దేశాలలో వైన్ ను పొడవైన కుప్పె, దాని కింద సన్నటి నిర్మాణం.. అడుగు భాగంలో వెడల్పాటి ఆకృతిలో ఉన్న గాజు గ్లాసులో తాగుతారు. బీర్ అయితే గాజు జగ్గులో స్వీకరిస్తారు. రమ్ అయితే దీర్ఘ చతురస్రాకారపు గాజు గ్లాసులో పోసుకుని తాగుతారు..కాల్ టైల్ అయితే ప్రత్యేకమైన గాజు గ్లాసులో పోసుకొని స్వీకరిస్తారు. కానీ మనదేశంలో అలా కాదు.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జంబో గ్లాస్ మాత్రమే.. అందులోనే బీర్, రమ్, కాల్ టైల్.. ఇంకా చాలా.. అందుకే భారతీయులు బంబోళ ” జంబో” ప్రియులంటూ ఓ నెటిజన్ మీమ్ రూపొందించాడు. అది విపరీతంగా ఆకట్టుకుంటున్నది.

    మన దేశంలో పాశ్చాత్య సంస్కృతి ఉన్నప్పటికీ.. మద్యం తాగే విషయానికి వచ్చేసరికి అలాంటి విధానాలు అలవడలేదని తెలుస్తోంది. శ్రీమంతులు మద్యం తాగే విధానంలో పాశ్చాత్యుల శైలిని అనుసరిస్తారేమో కానీ.. మిగతా వారంతా ఊర మాస్ స్టైల్ నే కొనసాగిస్తున్నారు. అందుకే మద్యం షాపులలో జంబో ప్లాస్టిక్ గ్లాసులే దర్శనమిస్తుంటాయి. అయితే వీటిల్లో మద్యం తాగడం మంచిది కాదని.. అసలు మద్యం తాగడమే ఒంటికి సరిపడదని వైద్యులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు మద్యపానానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్ ఆకట్టుకుంటున్న నేపథ్యంలో జంబో గ్లాస్ గురించి ఈ కథనం రాయాల్సి వచ్చింది. అంతేతప్ప మద్యపానాన్ని ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు.