Pawan Kalyan- Renu Desai: మెగా కుటుంబం నుంచి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్. సినిమాలు, రాజకీయాలు అంటూ దూసుకొని పోతున్నారు ఈ హీరో. కానీ తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు ట్రోల్ కి గురవుతూనే ఉంటారు. అయితే ఈయన రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు బద్రి సినిమాలో కలిసి నటించినప్పుడు వారి మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు అకిరా ఆధ్యా అనే ఇద్దరు సంతానం కూడా ఉన్నారు.
అయితే పిల్లలు పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకోని దూరంగా ఉంటున్నారు.. ఇక ఇద్దరు పిల్లలు కూడా రేణు దేశాయ్ వద్దనే ఉంటున్నారు. అయితే వీరు విడాకులు తీసుకున్న తర్వాత రేణు ఒంటిరిగా ఉంటున్నా..పవన్ కళ్యాణ్ మాత్రం మరొక వివాహం చేసుకున్నారు. భర్త నుంచి దూరమైన రేణూ సినిమాలకు కూడా దూరంగానే ఉంటుంది. రీసెంట్ గా సెకంగ్ ఇన్నింగ్స్ ప్రారంభించి.. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో సందడి చేయలేకపోయింది.
ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రేణు దేశాయ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన పిల్లల గురించి చేసినా వ్యాఖ్యలు మరింత ఆకట్టుకుంటున్నాయి. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ పిల్లల పేర్లు మనకు అకిరా ఆధ్యాగా మాత్రమే తెలుసు. కానీ వీరీ అసలు పేర్లు అఖీరా నందన్, ఆధ్యా కాత్యాయిని. అయితే ఈ పేర్లు ఎందుకు పెట్టారు అనే విషయం గురించి వివరించారు రేణూ.
అబ్బాయికి అఖీరా అనే పేరు తనకు నచ్చి పెట్టానని కానీ నందన్ అనే పేరు వాళ్ళ డాడీకి నచ్చడంతో నందన్ అని పెట్టుకోవాలి అనుకున్నారట. అలా అకీరానందన్ గా మారిపోయిందని రేణు దేశాయ్ వెల్లడించారు. ఇక ఆధ్యా కడుపులో ఉన్నప్పుడు తాను ఒక ఆధ్యాత్మిక బుక్కు చదువాను అని.. అందులో తనకు ఆధ్యా అనే పేరు చాలా బాగా నచ్చిందని ఆధ్యా అంటే మహాశక్తి మహాకాళి మహాలక్ష్మి అనే మూడు పేర్ల కలయిక కావడంతో తనకు ఈ పేరు చాలా బాగా నచ్చిందని చెప్పారు. అయితే గాయత్రి అమ్మ వారి పేరు అంటే కాత్యాయిని పేరు కూడా తనకు బాగా నచ్చిందట. ఇక రెండింటిలో ఏది పెట్టాలి అనే డైలమాలో తన నక్షత్రం ప్రకారం కా అని వస్తే కాత్యాయిని పెట్టాలని నిర్ణయించుకున్నారట. నక్షత్రం ప్రకారం అదే అక్షరం రావడంతో తనకు ఆ పేరు పెట్టామని ఇక తన పేరుకు ముందు ఆధ్యా అని పెట్టుకున్నానని తెలిపింది రేణూ దేశాయ్.