Actor Shritej: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్ జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకొని ఆర్జీవి వ్యూహం అనే సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, లోకేష్, పవన్ లపై సోషల్ మీడియా వేదికగా అనుచిత పోస్టులు పెట్టారని రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా పోలీసులు రామ్ గోపాల్ వర్మ కు నోటీసులు అందించారు. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే రామ్ గోపాల్ వర్మ కు కొంతవరకు గడువు ఇచ్చారు పోలీసులు. అయితే గడువు తీరిన రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనను అరెస్టు చేసేందుకు సిద్ధపడ్డారు. ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరోవైపు చంద్రబాబుకు వ్యతిరేకంగా తీసిన సినిమాలో ఆయన పాత్రలో నటించిన వ్యక్తి పై తాజాగా హైదరాబాదులో కేసు నమోదు అయింది. రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను తీసిన సంగతి తెలిసిందే. అందులో చంద్రబాబు పాత్రను పూర్తిగా నెగిటివ్ షెడ్ లో చూపించారు ఆర్జీవి. ఆ పాత్రలో నటించి మెప్పించారు శ్రీ తేజ్. ఆయనపై తాజాగా హైదరాబాదులో కేసు నమోదు కావడం విశేషం. ఒకవైపు ఆర్జీవి కోసం పోలీసుల గాలింపు, మరోవైపు హీరో శ్రీతేజ్ పై కేసు నమోదు సంచలనం గా మారింది.
* ఓ మహిళ ఫిర్యాదుతో
అయితే శ్రీతేజ్ పై నమోదు అయిన కేసు ఏపీతో సంబంధం లేనిది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదుతో శ్రీ తేజ్ పై కేసు నమోదు చేశారు. పెళ్లయిన వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని.. ఆ విషయం తెలిసి భర్త గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. శ్రీ తేజ్ మంచి నటుడిగా టాలీవుడ్ లో గుర్తింపు పొందాడు. పరంపరం, బహిష్కరణ అంటూ మంచి వెబ్ సిరీస్లో మెప్పించాడు. రాంగోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో మెయిన్ రోల్ ప్లే చేశాడు. సినిమాలో కీలకమైన చంద్రబాబు పాత్రలో మెరిశాడు.
* ఏపీ పోలీసుల గాలింపు
అయితే ఒకవైపు రాంగోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. సరిగ్గా ఆయన సినిమాలు నటించిన హీరో పై కేసు నమోదు కావడం విశేషం. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఓ ప్రముఖ హీరో ఆశ్రయం పొందారని ప్రచారం జరుగుతోంది. ఆయన కోసం ఏపీ పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మను అరెస్టు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.