Salaar: సలార్ సలార్ సలార్.. ఎక్కడ చూసిన ఇప్పుడు సలార్ ప్రభంజనమే కనిపిస్తుంది. ఇన్ని రోజులు ఫ్లాప్ లతో బాధ పడ్డ ప్రభాస్ అభిమానులు సలార్ హిట్ తో ఎగిరిగంతేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన శృతిహాసన్ నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 22 అంటే నిన్ననే థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తో దూసుకొని పోతుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన సలార్ ఈ రేంజ్ లో హిట్ సంపాదించడంతో ఈ హిట్ ను ఎంజాయ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.
సినిమా హిట్ టాక్ అందుకోవడంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా సలార్ వార్తలే కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ సినిమాలో నటించిన స్టార్ల రెమ్యూనరేషన్ కూడా వైరల్ అవుతోంది. ఈ సినిమాల్లో నటించిన స్టార్ల రెమ్యూనరేషన్ తెలుసుకోవడానికి సెర్చ్ చేస్తున్నారు. మీకు కూడా ఆ ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది. అయితే ఎందుకు ఆలస్యం.. చదివేయండి..
హీరో ప్రభాస్ సలార్ కోసం ఏకంగా రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అంతేకాదు లాభాల్లో కూడా 10శాతం తీసుకున్నారట. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూ. 50 కోట్లు, శృతిహాసన్ రూ. 8 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్ రూ. 4 కోట్ల పారితోషికం అందుకున్నారు. ఇక సినిమా టోటల్ బడ్జెట్ రూ. 400 కోట్ల వరకు ఉంటుందని టాక్.
మొత్తం మీద సినిమాకు పెట్టిన బడ్జెట్ లో రెమ్యూనరేషన్ కే ఎక్కువ ఖర్చు అయింది. అయినా ఇప్పుడు వస్తున్న టాక్ ను చూస్తుంటే.. ఈ బడ్జెట్ ను సంపాదించడం పెద్ద కష్టం కాదనే చెప్పాలి. మరి ఏ రేంజ్ లో లాభాలను సంపాదిస్తుందో చూడాలి.