https://oktelugu.com/

Priyanka Jain: బిగ్ బాస్ వంటలక్క ప్రియాంక జైన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా… పొట్టి పిల్ల గట్టిగానే రాబట్టింది!

సీజన్ 7 లో ఫినాలే లో అడుగు పెట్టిన ఒకే ఒక్క లేడీ కంటెస్టెంట్ ప్రియాంక. లేడీ టైటిల్ కొట్టాలన్న కల ప్రియాంక తీరుస్తుంది అనుకుంటే, ఐదవ స్థానంతో సరిపెట్టుకుంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 19, 2023 / 10:44 AM IST

    Priyanka Jain

    Follow us on

    Priyanka Jain: బిగ్ బాస్ సీజన్ 7 లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది ప్రియాంక. సీరియల్ నటిగా పాపులర్ అయిన ప్రియాంక అన్ని వారాలు హౌస్ లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. చివరకు ఫైనలిస్ట్ గా నిలిచి .. టాప్ 5 స్థానంలో ఎలిమినేట్ అయింది. ఇప్పటి వరకు జరిగిన ఏడు సీజన్లలో ఒక్క అమ్మాయి కూడా విజేత కాలేదు. సీజన్ 7 లో ఫినాలే లో అడుగు పెట్టిన ఒకే ఒక్క లేడీ కంటెస్టెంట్ ప్రియాంక. లేడీ టైటిల్ కొట్టాలన్న కల ప్రియాంక తీరుస్తుంది అనుకుంటే, ఐదవ స్థానంతో సరిపెట్టుకుంది.

    అయితే మిగిలిన లేడీ కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే ప్రియాంక బెస్ట్ అని చెప్పవచ్చు. టాస్కుల్లో 100 శాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడింది. పవర్ అస్త్ర కి సంబంధిన గేమ్స్ కానీ, కెప్టెన్సీ టాస్కుల్లో కానీ తన శక్తికి మించి కృషి చేసింది. కానీ ప్రతి సారి చివరి వరకు వెళ్లి కాస్త లో ఓడిపోయినా .. పట్టు విడవకుండా ప్రయత్నించింది. ప్రియాంక కు అంతగా ఫ్యాన్ బేస్ లేకపోయినప్పటికీ ఓట్లు బానే వచ్చాయి. కానీ ఫినాలే బరిలో ఉన్న వారు ఆమె కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఐదవ స్థానంతో సరిపెట్టుకుంది.

    బిగ్ బాస్ కి రాకముందు జానకి కలగనలేదు సీరియల్ లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది ప్రియాంక. దానికంటే ముందు మౌనరాగం సీరియల్ ద్వారా బాగా పాప్యులర్ అయ్యింది. ఇందులో ఆమె ప్రియుడు శివ్ కుమార్ తో కలిసి నటించిన ప్రియాంక .. అతనితో ప్రేమలో పడింది. ఇక కొంత కాలంగా వాళ్లిద్దరూ కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ వీక్ లో ప్రియాంక కోసం శివ్ ఎంట్రీ ఇచ్చాడు.

    కాగా ప్రియాంక బిగ్ బాస్ షో ద్వారా మరింత క్రేజ్ సంపాదించి. ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక సీజన్ 7 లో ప్రియాంక రెమ్యూనరేషన్ గురించి పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఒక్కో వారానికి ప్రియాంక రూ. 2. 50 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అంటే మొత్తం 15 వారాలకు రూ. 37. 5 లక్షలు అందుకుంది ప్రియాంక జైన్.