Bigg Boss 8 Telugu: కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సరికొత్త సీజన్ వచ్చే నెల నుండి స్టార్ మా ఛానల్ లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదల చేసారు. ట్రైలర్ కి సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవలే పూర్తి చెయ్యగా, ఆగష్టు 15 న ఆ ట్రైలర్ విడుదల చేసే ఆలోచనలో ఉంది బిగ్ బాస్ టీం. ఈ ట్రైలర్ లోనే సీజన్ ప్రారంభం అయ్యే తేదీ ని కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారట. ఇక పోతే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి ఇది వరకే మీరు సోషల్ మీడియా లో అనేక కథనాలు చూసి ఉంటారు. కానీ అధికారికంగా అగ్రిమెంట్ మీద సంతకం చేసింది కేవలం నలుగురు కంటెస్టెంట్స్ మాత్రమే.
వారెవరంటే రీతూ చౌదరీ, తేజస్విని గౌడా, బంచిక్ బబ్లూ మరియు అంజలి పవన్. వీరిలో అందరికంటే ఎక్కువ క్రేజ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది తేజస్విని గౌడానే. ఈమె గత సీజన్ లో రన్నర్ గా నిల్చిన అమర్ దీప్ కి భార్య. టీవీ సీరియల్స్ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అంతే కాకుండా ఈటీవీ, జీటీవీ, మాటీవీ లలో ఏర్పాటు చేసే ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఈమె పాల్గొంటూ ఉండేది. ఈ ఏడాది ప్రసారమైన నీతోనే డ్యాన్స్ షో లో తన భర్త అమరదీప్ తో కలిసి అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఎన్నో ఇచ్చి టైటిల్ కూడా కొట్టేసింది. సోషల్ మీడియా లో కూడా ఈమెకి యూత్ లో కావాల్సినంత క్రేజ్ ఉంది. కానీ ఈమెకి అమర్ దీప్ ని మించిన డిమాండ్ ఉందని మాత్రం రీసెంట్ గానే తెలుసుకొని షాక్ కి గురయ్యారు నెటిజెన్స్. బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నందుకు అమర్ దీప్ కి వారానికి లక్ష 50 వేల రెమ్యూనరేషన్ ఇచ్చేవారట. కానీ అతని భార్య తేజస్విని గౌడా కి ఏకంగా వారానికి నాలుగు లక్షల 75 వేల రెమ్యూనరేషన్ ని బిగ్ బాస్ టీం ఆఫర్ చేసిందట. ఈ షో లో పాల్గొనేందుకు ఆమెకి ఎంతో ఉత్సాహం ఉన్నప్పటికీ, సంతకం చేసేందుకు ఇంత ఆలస్యం చెయ్యడానికి కారణం రెమ్యూనరేషన్ విషయం లో భేరం కోసమే.
అమర్ దీప్ కి సోషల్ మీడియా లో సుడిగాలి సుధీర్ కి ఉన్నంత క్రేజ్ ఉంది. తేజస్విని గౌడా కి కూడా క్రేజ్ ఉంది కానీ, ఆ స్థాయిలో మాత్రం లేదు. అయినప్పటికీ కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చెయ్యడం చిన్న విషయం కాదు. ఇకపోతే ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్స్ టెలివిజన్ వెర్షన్ లో మగవాళ్లే టైటిల్ విన్ అవుతూ వచ్చారు, కానీ ఈ సీజన్ తేజస్విని టైటిల్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, ఆమెకి టైటిల్ రావాలని విశ్లేషకులు సైతం కోరుకుంటున్నారు. మరి ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఎలా ఆడుతుంది, ఎలా ముందుకుపోతుంది అనే దానిని బట్టే ఈమెకి టైటిల్ వస్తుందా లేదా అనేది తేలనుంది.