Homeఎంటర్టైన్మెంట్Uday Kiran- Athadu Movie: అతడు సినిమా ని ఉదయకిరణ్ మిస్ అవ్వడానికి కారణం అతనేనా?

Uday Kiran- Athadu Movie: అతడు సినిమా ని ఉదయకిరణ్ మిస్ అవ్వడానికి కారణం అతనేనా?

Uday Kiran- Athadu Movie: కొన్ని సినిమాలు ఒక చేతి హీరో నుండి జారిపొయ్యి మరో హీరో చేతికి వెళ్లడం..అవి హిట్ లేదా ఫట్ అవ్వడం మనం ఇది వరకు ఎన్నో చూసాము..అలా మిస్ చేసుకున్న హీరో అభిమాని ‘అబ్బా! మా హీరో ఇంత మంచి సినిమా మిస్ చేసుకున్నాడా’ అని బాధపడుతూ ఉంటాము..ఉదయకిరణ్ విషయం లో కూడ అలాంటిదే జరిగింది..2000 దశాబ్దం ప్రారంభం లో ఉదయ్ కిరణ్ ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో మన అందరికి తెలిసిందే..ఎలాంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన ఉదయకిరణ్ తొలి సినిమా చిత్రం తోనే భారీ హిట్ ని అందుకున్నాడు..ఆ తర్వాత వరుసగా నువ్వు నేను , మనసంతా నువ్వే , కలుసుకోవాలని వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు..కానీ ఆ తర్వాత ఆయన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని అనుకోని సంఘటనల వాళ్ళ సినిమాలు తగ్గిపోయాయి..కొన్ని సినిమాలను ఉదయ్ కిరణ్ స్వయంగా వదులుకోవాల్సి వచ్చింది..అలాంటి సినిమాలలో ఒకటే మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు సినిమా.

Uday Kiran- Athadu Movie
Uday Kiran

ప్రముఖ సీనియర్ నటుడు మురళి మోహన్ నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద సక్సెస్ ఏమి కాదు..కానీ ఒక మంచి సినిమా గా..టాలీవుడ్ లో ఆల్ టైం క్లాసిక్ సినిమాలలో ఒకటిగా సరికొత్త చరిత్ర ని సృష్టించింది ఈ సినిమా..ముఖ్యంగా బుల్లితెర మీద ఈ మూవీ బంపర్ హిట్..ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీ లో వస్తే ప్రేక్షకులు టీవీ లకు అతుక్కుపొయ్యి చూస్తారు..అయితే ఈ సినిమాని మొదట ఉదయకిరణ్ తో తెరకెక్కించాలని అనుకున్నాడట ఆ చిత్ర నిర్మాత మురళి మోహన్..ఇటీవల ఆయన ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ పంచుకున్నాడు.

Also Read: Sammathame Collections: ‘సమ్మతమే’ క్లోజింగ్ కలెక్షన్స్.. ఫైనల్ రిజల్ట్ ఇదే

Uday Kiran- Athadu Movie
Athadu Movie

మురళి మోహన్ మాట్లాడుతూ ‘ఉదయ్ కిరణ్ మొదటి సినిమా చూసి ఈ అబ్బాయి ఎవరో చాల బాగున్నాడు..బుద్దిమంతుడు లాగ ఉన్నాడు..చాల బాగా నటించాడు..ఒకసారి మాట్లాడుదాం అని ఫోన్ చేసి అభినందనలు తెలిపాను..అప్పుడు ఉదయ్ కిరణ్ మీరు నాకు ఫోన్ చెయ్యడం చాల అనందం గా ఉంది అండీ..ఒక్కసారి ఇంటికి వచ్చి కలిసాడు..అప్పటి నుండి తరచు ఇంటికి వస్తుండేవాడు..ఇంకా చెప్పాలంటే అతడు సినిమాని మొదట హీరోగా అనుకున్నది ఉదయకిరణ్ నే..అడగగానే దానికంటే భాగ్యమా కచ్చితంగా చేస్తాను అని చెప్పాడు..కానీ ఆ సమయం లోనే చిరంజీవి గారి కూతురుతో పెళ్లి నిశ్చయం అవ్వడం..ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల మనిషి బాగా తికమకి కి గురయ్యాడు..అతడు సినిమా డేట్స్ కోసం కాల్ చేస్తే సారి అండీ..డేట్లు సర్దుబాటు చెయ్యలేకున్నాను..వేరే వాళ్లకి ఇచ్చి ఉన్నాను అని చెప్పాడు..అప్పుడు మేము మహేష్ బాబు తో తీసాము’ అంటూ చెప్పుకొచ్చాడు మురళి మోహన్.

Also Read: Macherla Niyojakavargam: నితిన్ డ‌బుల్ మీనింగులు, అంజలి ఘాటు ఫోజులు.. ఇది మామూలు రచ్చ కాదు

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular