https://oktelugu.com/

Tollywood: ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కూడా వీళ్ళు హీరోలుగా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా..?

నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తారకరత్న ఒకే రోజు 9 సినిమాలను అనౌన్స్ చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురించి చేశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 27, 2024 / 01:15 PM IST
    Follow us on

    Tollywood: సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోలుగా కొనసాగే నటులు వాళ్ళ తదనంతరం సినిమా ఇండస్ట్రీ హీరోలుగా కొనసాగడానికి వాళ్ళ వారసులను ఇండస్ట్రీలోకి దింపుతూ ఉంటారు. అయితే అందులో చాలామంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవ్వలేక ఫేడ్ అవుట్ అవుతున్నారు. కొందరు మాత్రమే ఆచి తూచి అడుగులు వేస్తూ సూపర్ సక్సెస్ అవుతూ స్టార్ హీరోలుగా గుర్తింపు పొందుతున్నారు. అయితే ఇప్పటివరకు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొంతమంది వారసుల ఫెయిల్యూర్ వెనక కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    నాగబాబు
    చిరంజీవి మెగాస్టార్ గా(Mega Star Chiranjeevi) తన స్టార్ డమ్ ను విస్తరించుకున్న తర్వాత నాగబాబుని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక నాగబాబు చేసిన సినిమాలు ఏవి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో ఆయన ఇండస్ట్రీ నుంచి హీరోగా ఫెయిడౌట్ అయిపోయాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఇప్పటికి మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. అయితే నాగబాబు సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే నాగబాబు హీరో మెటీరియల్ కాదు. ఇక దానికి తోడుగా అసలు ఆయనకి హీరోగా చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏదో చిరంజీవి మొహమాటానికి ఆయన హీరోగా మారాడు తప్ప ఆయనకు హీరో అవ్వాలనే ఉద్దేశ్యం ఉన్నట్టుగా ఎప్పుడూ కనిపించలేదు…

    తారకరత్న
    నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తారకరత్న ఒకే రోజు 9 సినిమాలను అనౌన్స్ చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురించి చేశాడు. అయితే తారక రత్న ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేదు దాంతో ఆ తర్వాత కూడా ఆయన చేసిన వరుస సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆయన ఇండస్ట్రీ నుంచి వెను తిరగాల్సి వచ్చింది. ఇక ఈయన ఫెయిల్యూర్ కి ముఖ్య కారణం ఏంటి అంటే స్క్రిప్ట్ సెలక్షన్ లో చేసిన మిస్టేక్స్ అనే చెప్పాలి. ఎంతసేపు ఆయనే బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు భారీ యాక్షన్ సినిమాలను చేస్తున్నారు. కాబట్టి తను కూడా అలాంటి సినిమాలనే చేయాలని ముందుకు సాగాడు. అంతే తప్ప తన బాడీ లాంగ్వేజ్ కి ఎలాంటి కథలు అయితే సెట్ అవుతాయో వాటిని ఎంచుకోవడంలో ఆయన చాలావరకు అంచన వేయలేకపోయాడు…అందువల్లే ఇండస్ట్రీ నుంచి తొందరగా ఫేడ్ అవుట్ అయిపోయాడు…గత సంవత్సరం అనారోగ్యం కారణం గా ఆయన మరణించిన విషయం మనకు తెలిసిందే…