https://oktelugu.com/

Star Heroines: గర్వంతో ఉన్న స్టార్ హీరోలకు సవాళ్లు విసిరిన స్టార్ హీరోయిన్లు వీళ్లే… ఏం జరిగిందంటే..?

ఫస్ట్ టైం స్టార్ హీరో లేకుండా 'ఒసేయ్ రాములమ్మ ' అనే సినిమాలో మెయిన్ లీడ్ గా నటించి స్టార్ హీరోలకి సైతం చెమటలు పట్టించిన హీరోయిన్ విజయ శాంతి. ఈ సినిమాతో ఆమె దాదాపు ఇండస్ట్రీ హిట్ కొట్టినంత పనిచేసింది.

Written By:
  • Gopi
  • , Updated On : February 27, 2024 / 01:39 PM IST
    Follow us on

    Star Heroines: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి హీరోలా డామినేషన్ అనేది ఎక్కువగా నడుస్తూ వచ్చేది. వాళ్ళు ఉంటేనే సినిమా లేకపోతే లేదు. అనేంతలా మన హీరోలు తెగ ఫీల్ అయిపోతూ ఉండేవారు…అందుకే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒకరు వాళ్లను బాబు బాబు అంటూ పిలుస్తూ వాళ్ల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఇక ప్రొడ్యూసర్ల పరిస్థితి మరి దారుణంగా ఉండేది. హీరోలు ఎంత చెబితే అంతా ఎన్ని కోట్లు పెట్టమంటే ఆ సినిమాకి అన్ని కోట్లు పెట్టాలి. మరో మాట మాట్లాడితే వాళ్లకి ఇంకో సినిమాకి డేట్స్ ఇవ్వరు. అలాంటి ఒక దారుణమైన పరిస్థితి నుంచి హీరోలు అంటే సామాన్యుడే అనే స్టేజ్ కి మన హీరోలని తీసుకొచ్చిన హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు. వాళ్లలో మొదటగా విజయశాంతి (Vijayashanthi) పేరు చెప్పుకోవాలి…

    ఫస్ట్ టైం స్టార్ హీరో లేకుండా ‘ఒసేయ్ రాములమ్మ ‘ అనే సినిమాలో మెయిన్ లీడ్ గా నటించి స్టార్ హీరోలకి సైతం చెమటలు పట్టించిన హీరోయిన్ విజయ శాంతి. ఈ సినిమాతో ఆమె దాదాపు ఇండస్ట్రీ హిట్ కొట్టినంత పనిచేసింది. ఒక్కసారిగా స్టార్ హీరోల ఇమేజ్ ని దారుణంగా డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. హీరోలు ఉన్నా లేకపోయిన కథలో దమ్ముంటే సినిమా ఆడుతుంది అని విజయశాంతి ఈ సినిమాతో ప్రూవ్ చేసింది… దెబ్బకి అప్పుడున్న స్టార్ హీరోలందరూ బెంబెలెత్తిపోయారు. మేమే అన్ని అనుకునేవారు ఆ దెబ్బతో కొంచెం తగ్గి మనం ఎలాంటి సినిమాలు చేయాలి అనే దానిమీద దృష్టి పెట్టెంత వరకు వచ్చారంటే ఆమె ఇచ్చిన స్ట్రోక్ ఎంతలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు…

    ఇక ఇదిలా ఉంటే 2009వ సంవత్సరంలో అరుంధతి సినిమాతో అనుష్క ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్ హీరోల సరసన నిలబడిందనే చెప్పాలి. ఇక ఈ దెబ్బతో అనుష్క స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందడమే కాకుండా విజయశాంతి తర్వాత స్టార్ హీరోలందరికి ఒక జలక్కిచ్చిందనే చెప్పాలి…ఇలా హీరోల గర్వం తలకెక్కిన ప్రతి సారీ ఇలాంటి హీరోయిన్లు వచ్చి ఇండస్ట్రీ లో హీరో లా ప్రాముఖ్యత ఏమి లేదు. మంచి కథ ఉంటే మేము కూడా ఇండస్ట్రీ హిట్లు కొడతాం అని ప్రూవ్ చేసి చూపించారు…