Sobhan Babu: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావడం అనేది చాలా కష్టం. ఒకవేళ వచ్చిన ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమం లోనే ఒకప్పుడు తన సొంత ఐడెంటిటీతో ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకొని దాదాపు 35 సంవత్సరాల పాటు స్టార్ హీరోగా ఎదిగిన నటుడు శోభన్ బాబు…
తన అందంతో ఆడవాళ్ళ హృదయాలను దోచుకొని, అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకొని ఫ్యామిలీ స్టార్ గా కూడా గుర్తింపు పొందాడు. ఈయన ఒక్కో దశలో ఒక్కో క్యారెక్టర్ లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ‘ఆంధ్ర అందగాడు ‘ గా గుర్తింపు పొందిన శోభన్ బాబు తన ఎంటైర్ కెరీయర్లో ఎన్నో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ లను కూడా క్రియేట్ చేశాడు. ఇక అందులో ఆయన చేసిన ‘సోగ్గాడు ‘ సినిమా ఒకటి. ఈ సినిమాతో ఆయనకు వచ్చిన స్టార్ డమ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోలు సైతం స్టన్ అయ్యేలా ఈ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు.
ఇక అప్పటి నుంచి సోగ్గాడు అనే పేరు శోభన్ బాబు ఒక్కడికే సొంతం అనేంత గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే హీరోగా తన మార్కెట్ డౌన్ అయిన తర్వాత తనకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో ఆయనకు అవకాశాలు వచ్చాయి. అయినప్పటికీ తను ఏ పాత్రని కూడా యాక్సెప్ట్ చేయకుండా అన్నింటిని రిజెక్ట్ చేశాడు. దానికి కారణం ఏంటి అని ఒక ఇంటర్వ్యూ లో ఆయన్ని అడగగా ఆయన ఇలా చెప్పారు.’చాలా సంవత్సరాల నుంచి నన్ను నా అభిమానులు హీరోగానే గుర్తిస్తూ వాళ్ల గుండెల్లో పెట్టుకొని ఆరాదిస్తున్నారు’. కాబట్టి వాళ్ల దృష్టిలో నేను హీరో గానే ఉండాలి. మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తే వాళ్లు నన్ను యాక్సెప్ట్ చేసినా కూడా నాకది నచ్చదు.కాబట్టి నేనెప్పుడూ వాళ్ళ హృదయంలో హీరో గానే ఉండాలి అనే ఉద్దేశ్యం తోనే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో చేయడం లేదు అని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ఆయన రిజెక్ట్ చేసిన క్యారెక్టర్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం…
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అతడు సినిమాలో నాజర్ పోషించిన సత్యనారాయణ మూర్తి అనే పాత్ర కోసం ఈ సినిమా నిర్మాత అయిన మురళీమోహన్ శోభన్ బాబు గారిని అడిగాడట కానీ ఆయన ఆ పాత్రని సున్నితంగా రిజెక్ట్ చేశాడట…
ఇక అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన సుస్వాగతం సినిమాలో రఘువరన్ పోషించిన పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రకి కూడా మొదట శోభన్ బాబుని అడిగారట కానీ ఆయన ఆ పాత్ర చేయడానికి కూడా ఇష్టపడలేదు.
అలాగే రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం మొదటగా ఈయన్నే సంప్రదించారట, కానీ ఆయన దానికి కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో సుమన్ ఆ పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…
ఇక ఇవి అనే కాకుండా ఆ తర్వాత కూడా ఆయనకు చాలా పాత్రల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆయన మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వి.బి రాజేంద్రప్రసాద్ ప్రొడ్యూసర్ గా ఒక మల్టీస్టారర్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. అందులో శోభన్ బాబు, కృష్ణ, జగపతి బాబు ముగ్గురు హీరోలుగా నటించాల్సింది కానీ ఆ సినిమా కొన్ని అనీవార్య కారణాల వల్ల సెట్స్ మీదికి వెళ్లలేదు…