Kondaveeti Simham- Chiranjeevi: శీర్షిక చదివి సోయి ఉండే పెట్టారా.. అని అనుకుంటున్నారా? కానే కాదు. లేకుంటే చిరంజీవికి నటించడం రాదా అని చెబుతున్నారు మీకు ఎన్ని గుండెలు? అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారా? లేకుంటే మమ్మల్ని నానా బూతులు తిట్టుకుంటున్నారా?.. అయితే మేము పెట్టిన శీర్షికకు మీరు జస్టిఫై కావాలి అంటే ఈ కథనం చదవాల్సిందే. ఆ తర్వాత మీరే అభిప్రాయాన్ని మార్చుకుంటారు.

సినిమా అంటేనే రంగుల ప్రపంచం. బయటికి ఆ రంగుల్లో పారదర్శకత ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ లోతుల్లోకి వెళ్తే కానీ అర్థం కాదు. కులం, ఆశ్రిత పక్షపాతం, ఇంకా మన్నూ మశానం టన్నుల్లో ఉంటాయి. హిప్పొక్రసీ పాళ్ళు ఎక్కువగా ఉండే సినిమా రంగంలో సమతూకం ఆశించడం మన పొరపాటే. సో ఇవన్నీ పక్కన పెడితే.. సీనియర్ ఎన్టీఆర్ హవా నడుస్తున్న రోజులవి. ఆయన సోలోగా కాకుండానే మల్టీ స్టారర్ చిత్రాలు కూడా చేసేవారు. అప్పట్లో ఆయన నటించిన కొండవీటి సింహం బ్లాక్ బస్టర్ అయింది. 1981 అక్టోబర్ 7న విడుదల ఈ సినిమా సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఒక మైలురాయి. ఎస్పి రంజిత్, రాముగా ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎస్పి రంజిత్ కుమార్ భార్యగా జయంతి, రాముకు జోడిగా శ్రీదేవి నటించారు. ఈ సినిమాను రోజా మూవీస్ బ్యానర్ మీద ఎం అర్జునరాజు, కే శివరామరాజు నిర్మించారు.
Also Read: Pragathi: ప్రగతి ఆ ‘పట్టు’ పడితేనే ఈ స్థాయికి వచ్చిందట.?
-మొదట్లో చిరంజీవి తీసుకున్నారు
సమాజంలో పెరిగిపోతున్న అవినీతిని ఓ పోలీస్ అధికారి ఎలా నిర్మూలించాడో ఈ సినిమా ద్వారా దర్శకుడు కే రాఘవేంద్రరావు చెప్పాలి అనుకున్నారు. ఈ కథలో ఎన్టీఆర్ ద్వారా రెండు పాత్రలు వేయించారు. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్రకు అప్పటి వర్ధమాన నటుడు చిరంజీవిని అనుకున్నారు. అన్నట్టుగానే ఆయన, ఎన్టీఆర్ కాంబినేషన్లో కొన్ని సీన్లను చిత్రీకరించారు. అయితే వాటిని చిరంజీవి సరిగా చేయలేకపోయారు. ఇందుకు కారణం కూడా ఉంది. ఎన్టీఆర్ ను చూస్తూ చిరంజీవి సరిగా నటించలేకపోవడం, డైలాగులు సక్రమంగా చెప్పడంలో ఇబ్బంది పడేవారు. ఆ సినిమాకు ఎన్టీఆర్ నెల రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారు. ఇక చిరంజీవి టేకుల మీద టేకులు తీసుకుంటుండడంతో షూటింగ్ ఆలస్యం అవుతుందని భావించి ఆయన స్థానంలో మోహన్ బాబును తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్కు దీటుగా మోహన్ బాబు నటించారు. ఇద్దరి మధ్య పోటాపోటీ సన్నివేశాలు ఉండడంతో అవి ప్రేక్షకులను రక్తి కట్టించాయి. షూటింగ్ అనంతరం 1981 అక్టోబర్ 7న కొండవీటి సింహం పేరుతో ఈ సినిమా విడుదలైంది. చక్రవర్తి స్వర పరిచిన ఏడు పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను 47 ప్రింట్లతో 43 కేంద్రాల్లో విడుదల చేశారు. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో తర్వాత ప్రింట్ల సంఖ్యను పెంచారు.. దాదాపు 200 కేంద్రాల్లో అర్థ దినోత్సవం, 15 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది.

-పలుమార్లు చిరంజీవి కూడా చెప్పుకున్నారు
అయితే ఈ సినిమా అనంతరం కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి పలు సినిమాల్లో నటించారు. అయితే కొండవీటి సింహం సినిమాలో తాను సరిగా నటించకపోవడం వల్లే అవకాశం కోల్పోయానని చిరంజీవి పలుమార్లు చెప్పుకున్నారు. ఒకానొక సందర్భంలో తాను చాలా బాధపడ్డాను అని, తర్వాత తేరు కొన్నానని చిరంజీవి అంటూ ఉండేవారు. తన స్థానంలో మోహన్ బాబు ను తీసుకోవడం మంచిదైందని, దానివల్లే ఆ పాత్రకు మరింత బలం వచ్చిందని ఆయన అనేవారు. కొండవీటి సింహం అనంతరం కొన్ని సంవత్సరాల తర్వాత కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అప్పట్లో ఎన్టీఆర్ చిరంజీవిని ప్రత్యేకంగా తన ఇంటికి పిలిపించుకొని అభినందించారట! ఈ విషయాన్ని మధ్య ఈటీవీలో ప్రసారమైన ఒక కార్యక్రమంలో రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడంటే రాఘవేంద్రరావు ఫేడ్ అవుట్ అయ్యారు కానీ.. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో కమర్షియల్ సినిమాలకు ఆయనే కేరాఫ్ అడ్రస్.
[…] Also Read: Kondaveeti Simham- Chiranjeevi: ఆయనతో చిరంజీవి నటించలేకప… […]