Bigg Boss 6 Telugu Inaya And Raj: బిగ్ బాస్ హౌస్ లో దారుణాలు చోటుచేసుకుంటున్నాయా అంటే…. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒక లేడీ కంటెస్టెంట్, మేల్ కంటెస్టెంట్ ఒకే దుప్పట్లో దూరడం సంచలనమైంది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ బయటికి రాగా… ఛీ ఛీ ఇదేం పైత్యం బాబోయ్ అంటున్నారు. కంటెస్టెంట్ ఇనయా సుల్తానా, రాజ్ రెచ్చిపోతున్నారు. వీరు రొమాన్స్ విషయంలో హద్దులు దాటేస్తున్నారు. ఒకే బెడ్ పై పడుకోవడమే కాకుండా దుప్పట్లో దూరుతున్నారు. కొద్దిరోజులుగా ఇనయా, రాజ్ దగ్గరవుతున్నట్లు అనిపిస్తుంది. ఇక మంగళవారం కెప్టెన్సీ టాస్క్ మొదలైంది.

హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్ లో కంటెస్టెంట్స్ కొందరు హోటల్ గెస్ట్స్ గా, మరికొందరు హోటల్ సర్వెంట్స్ గా విభజించబడ్డారు. ఇక ఈ టాస్క్ గురించి చర్చిస్తున్న సాకుతో ఇనయ, రాజ్ దుప్పట్లో దూరారు. వారు ఏదో గుసగుసలాడుకున్నారు. కంటెస్టెంట్స్ అందరూ పడుకున్నాక, లైట్స్ తీసేశాక వారిద్దరూ ఒక మంచం మీదకి చేరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో బిగ్ బాస్ హౌస్ ని ఏంట్రా ఇంత దారుణంగా మార్చేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదంతా నిర్వాహకుల ప్లాన్ లో భాగమేనని కొందరి అభిప్రాయం. టీఆర్పీ కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు.
ఈసారి బిగ్ బాస్ షో అట్టర్ ప్లాప్. కనీసం సీరియల్స్ కి వస్తున్న టీఆర్పీ కూడా బిగ్ బాస్ ఎపిసోడ్స్ రావడం లేదు. నాగార్జున వస్తున్న వీకెండ్ ఎపిసోడ్స్ పరిస్థితి కూడా అలానే ఉంది. కోట్లు పెట్టుబడి పెట్టి నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోకి ప్రస్తుతం వస్తున్న రేటింగ్ ఏమాత్రం సరిపోదు. కనీసం పెట్టుబడికూడా రాదు. మసాలా కంటెంట్ తో షోకి ఆదరణ, టీఆర్పీ తీసుకురావాలని నిర్వాహకుల ప్లాన్ గా తెలుస్తుంది. కావాలనే ఇనయ,రాజ్ మసాలా వీడియో లీక్ చేశారట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సిపిఐ సీనియర్ నేత బిగ్ బాస్ హౌస్ ని బ్రోతల్ హౌస్ అన్నారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ గుండు చేయించాలని పరుష వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూశాక నారాయణకు మద్దతు పెరుగుతుంది. కాగా 21 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ తెలుగు 6 ప్రారంభమైంది. మొదటి వారం ఎలాంటి ఎలిమినేషన్ లేదు. అయితే సెకండ్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పేరుతో కంటెస్టెంట్స్ షాని, అభినయశ్రీలను బయటికి పంపారు. ఇక మూడవ వారం నేహా చౌదరి ఎలిమినేట్ కావడం జరిగింది. ప్రస్తుతం హౌస్ లో 18 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.