Pragathi: క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో నెంబర్ వన్ లో నిలిచేది ప్రగతి. తనదైన శైలిలో నటిస్తూ అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకత సాధించుకుంది. అమ్మ, ఆంటీ పాత్రల్లో జీవిస్తోంది. దీంతో అవకాశాలు వాటంతటవే వస్తున్నాయి. జీవితంలో ఏదైనా చేయాలంటే ధైర్యం ఉండాలి. ఎవరైనా ఏదైనా అనుకుంటారనుకుంటే జీవితంలో ముందుకెళ్లలేం. లక్ష్యసాధనలో దేన్ని కూడా లెక్కచేయకూడదు. విమర్శలను అసలే పట్టించుకోకూడదు. కరోనా కాలంలో చాలా మంది ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం. ఈ నేపథ్యంలో ప్రగతి కూడా కొత్తదనం కోసం ప్రయత్నించింది. ఎవరో ఏదో అనుకుంటారని భయపడలేదు. తాను అనుకున్నది సాధించాలని ముందుకే నడిచింది. కానీ వెనుకకు తిరిగి చూసుకోలేదు. ఫలితంగా ఇప్పుడు చాలా మంది నెటిజన్లకు ఆదర్శప్రాయంగా మారుతోంది.

Pragathi
ప్రగతి ఓ యూ ట్యూబ్ చానల్ ప్రారంభించింది. అందులో తను చేసే పనులు పోస్టులు చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లోకి వెళితే చాలా ధైర్యం ఉండాలి. విమర్శలను సైతం స్వీకరించాలి. ప్రశంసలతో సమానంగా విమర్శలను తీసుకోవాలి. అంతే కాని ఎవరో విమర్శిస్తే నేను కేసులు పెడతా అంటే కుదరదు. ఎవరైనా ఇంట్లో ఉంటే ఏమీ అనరు. కానీ బయటకొస్తే ఎన్నో మాటలు వస్తాయి. వాటిని సద్విమర్శలుగానే భావించుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అనుకున్నది సాధిస్తాం.
ఇప్పుడు ప్రగతి కూడా అదే చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. పక్కవారు ఏదో అన్నారని కూర్చుంటే కుదరదు. ముందుకెళితేనే మనం అనుకున్నది సాధిస్తాం. ఎవరో ఏదో అన్నారని బాధ పడితే భవిష్యత్ అంధకారమే అవుతుంది. ప్రగతి జిమ్ లో చేసే విన్యాసాలు పోస్టులు పెడుతుంటే కొందరు ఈ వయసులో మీకెందుకు ఆంటీ ఈ పనులు అని కొందరు నవ్వుకున్నా ఆమె బెదరలేదు. తన ప్రస్థానాన్ని ఆపలేదు. దీంతో ఆమెను ఇప్పుడు అందరు ప్రశంసిస్తున్నారు.

Pragathi
ఆంటీ మీలాంటి ఆత్మవిశ్వాసం ఉన్న వారు ఉండాలి. మీరు అనుకున్నది సాధించాలనే తపనతో మీరు నడిచే దారి సమంజసమే. దీంతో ఆమెకు ఊపునిస్తోంది. ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే సామాజిక మాధ్యమాల్లో తనకు సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ అభిమానులతో సందడిగా ఉంటోంది. దీంతో వారు కూడా ఆంటీ అంటూ ఆప్యాయంగా మాటలు కలుపుతున్నారు. లాక్ డౌన్ సమయం నుంచి ప్రగతి సామాజిక మాధ్యమాల్లో జనానికి దగ్గరవుతోంది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో తన ఫొటోలు పోస్టులు చేస్తూ సందడి చేస్తోంది. అనుకున్నది సాధించే క్రమంలో అనవసర పట్టింపులు ఉంటే మనుగడ సాగించడం కష్టమే అని చెబుతోంది.