Balakrishna Vs Nagarjuna: మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఆ తర్వాత చాలా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది సెలబ్రెటీలు అయితే మరింత దారుణంగా ఉంటుంది. దీంతో పబ్లిక్ లో మాట్లాడాలి అంటే నటీనటులు ఆచితూచి మాట్లాడుతుంటారు. ఏది మాట్లాడేముందు అయినా ఆలోచించి మాట్లాడుతుంటారు. లేదా అభిమానుల విమర్శలను కూడా తట్టుకోవాల్సిందే. ఇలానే కొన్ని సార్లు బాలయ్య కూడా కొన్ని వివాదాల్లో ఇరుక్కుంటారు. మాటల్లో మాటల్లో ఏదో మాట్లాడి ఇబ్బంది పడుతుంటారు బాలయ్య. ఈ మధ్య కాలంలో అక్కినేని ఫ్యామిలి గురించి నోరు జారి ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు బాలయ్య. కొంత మంది కావాలనే అన్నాడు అంటే.. మరికొంత మంది అనుకోకుండా అన్నాడని సపోర్ట్ చేశారు. అయినా కావాలనే అనేంత వైరాలు నాగ్, బాలయ్య కుటుంబంలో వైరాలు ఉన్నాయా లేదా అనేవి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం…
కొన్ని రోజులుగా స్టార్ హీరో బాలయ్య, అటు నాగార్జున మధ్య వార్ పీక్స్ కు వెళ్లింది. స్టార్ హీరో బాలయ్య నాగ్ మధ్య గొడవకు కారణమేంటి అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరిగింది. దీంతో ఈ ఇద్దరు హీరోల మధ్య గొడవకు కారణం బాలయ్య హీరోగా నటించిన శ్రీమన్నారాయణ సినిమా అని అంటున్నారు నెటిజన్లు. రవి చావలి డైరెక్షన్ లో బాలయ్య హీరోగా ఇషాచావ్లా, పార్వతీ మెల్టన్ హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది.ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
2012 సంవత్సరం ఆగష్టు 30వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన వారం రోజలకే నాగార్జున నటించిన షిరిడి సాయి అనే సినిమా కూడా థియేటర్లలో విడుదలైంది.ఆ సమయంలో ప్రముఖ థియేటర్ లో పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న శ్రీమన్నారాయణ సినిమాను తొలగించి.. షిరిడి సాయి సినిమాకు థియేటర్ కేటాయించడంతో వివాదం చెలరేగింది. ముఖ్యంగా కూకట్ పల్లిలోని ప్రముఖ థియేటర్ లో ఈ గొడవ మరీ ఎక్కువగా జరిగింది. ఈ గొడవ కాస్త అప్పట్లో పోలీస్ స్టేషన్ కు చేరడంతో బాలయ్య దర్శకనిర్మాతలపై ఫైర్ అయ్యారు. ఈ ఘటన వల్ల బాలయ్య నాగ్ మధ్య దూరం పెరిగింది.
ఏఎన్నార్ చనిపోయిన సమయంలో ఆయనతో అనుబంధం ఉన్నా.. బాలయ్య హాజరు కాకపోవడం వెనుక అసలు కారణం ఇదేనని కూడా టాక్ వచ్చింది. ఆ తర్వాత రోజుల్లో బాలయ్య, నాగ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. బాలయ్య డిక్టేటర్, నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమాలు ఒక్కరోజు గ్యాప్ తో విడుదల కాగా సోగ్గాడే చిన్నినాయన సినిమా విజేతగా నిలిచింది. శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన డిక్టేటర్ మూవీ యావరేజ్ గా నిలిచింది. కానీ అసలు వీరి మధ్య అసలు వైరాలే లేవని వీరు డిక్లేర్ చేశారు. మరి ఎందుకు ఇప్పుడు అక్కినేని గిక్కినేని అని బాలయ్య అన్నారు. అక్కినేని ఫ్యామిలీని అంత చీప్ గా తీసిపారేయడం ఎందుకు? ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి ఇలా మాట్లాడితే సైలెంట్ గా ఉంటారా అంటూ అక్కినేని అభిమానులు బాలకృష్ణ పై ఫైర్ అయ్యారు.