Tamanna Bag: తమన్నా చేతిలో ఉన్న ఈ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే మెంటలెక్కిపోతారు

'హ్యాపీ డేస్' సినిమాతో కెరీర్ లో మొట్టమొదటి సూపర్ హిట్ ని అందుకున్న తమన్నా ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Written By: Vicky, Updated On : May 18, 2023 7:49 am

Tamanna Bag

Follow us on

Tamanna Bag: సౌత్ ఇండియా లో సుమారుగా దశాబ్దం పై నుండి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఇప్పటికీ కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతున్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో తమన్నా పేరు ముందు వరుసలో ఉంటుంది. అసలు ఈమెకి వయస్సు అవ్వదా, సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి కానీ, ఈమె అందం ఇసుమంత కూడా తగ్గలేదే అని పాలరాతి శిల్పం లాంటి ఈమె సౌందర్యాన్ని చూసినప్పుడల్లా అనిపిస్తూనే ఉంటుంది.

‘హ్యాపీ డేస్’ సినిమాతో కెరీర్ లో మొట్టమొదటి సూపర్ హిట్ ని అందుకున్న తమన్నా ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో నటించిన ఈమె కోలీవుడ్ మరియు బాలీవుడ్ ని కూడా వదలలేదు. అందం తో పాటు అద్భుతమైన నటన మరియు డ్యాన్స్ వచ్చిన తమన్నా సోషల్ మీడియా లో తరచూ యాక్టీవ్ గా ఉంటుంది.

ఈమె సోషల్ మీడియా లో అప్లోడ్ చేసే ఫోటోలలో ఆమె ధరించే దుస్తులు వగైరా వంటివి అభిమానులు బాగా గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె వాడే వస్తువులను మరియు దుస్తులను తాము కూడా వాడాలని పరితపించే మనస్తత్వం అభిమానులది.అలాగే రీసెంట్ గా ఆమె విమానాశ్రయం లో కనిపించిన ఒక ఫోటో లో ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ అభిమానుల దృష్టిని బాగా ఆకర్షించింది.అది కొనుగోలు చేద్దాం అని గూగుల్ లో వెతికి కొనుగోలు చెయ్యబోతుండగా రేట్స్ చూసి ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయినంత పని అయ్యింది.

ఈ బ్యాగ్ ఖరీదు అక్షరాలా లక్ష రూపాయలట.10 వేల రూపాయిల లోపు బోలెడంత బట్టలను కొనుగోలు చేసే మన లాంటి మిడిల్ క్లాస్ మనుషులకు కేవలం చూసేదానికి మాత్రమే, కొనేదానికి సరిపోదు. కొంతమంది వీరాభిమానులు తమకి వచ్చే జీతం మొత్తాన్ని ఖర్చు చేసి ఇలాంటి వస్తువులను ఖర్చు చేసిన రోజులు కూడా ఉన్నాయి, అభిమానం అలాంటిది మరి.