Homeఎంటర్టైన్మెంట్Bro Shoe : జీప్ మీద ఉన్న ఈ బూట్ల ధర ఎంతో తెలుసా..? ఆ...

Bro Shoe : జీప్ మీద ఉన్న ఈ బూట్ల ధర ఎంతో తెలుసా..? ఆ ధర తో ఒక నెలమొత్తం బ్రతికేయొచ్చు!

Bro Shoe : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం ఈ నెల విడుదల అవ్వబోతున్న సందర్భంగా, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని రెండు రోజుల క్రితం విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వింటేజ్ పవర్ స్టార్ స్టైల్, డైలాగ్ డెలివరీ  మరియు కామెడీ టైమింగ్ ని చూసి అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆనందించారు.

ఫలితంగా ఈ టీజర్ కి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే ఈ టీజర్ 32 మిలియన్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. అతి త్వరలోనే 40 మిలియన్ వ్యూస్ ని కూడా అందుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ వేసుకున్న కాస్ట్యూమ్స్ అభిమానులకు చాలా బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ కి సంబంధించినది ఏ చిన్న వస్తువు అయినా కొనుక్కోవడానికి ఎగబడే ఫ్యాన్స్ ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ వేసుకున్న షూస్ మరియు డ్రెస్ ఎక్కడ దొరుకుంటుందా అని ఇంటర్నెట్ లో వెతుకుతున్నారు.

ముఖ్యంగా ఆయన జీపు మీద సాయి ధరమ్ తేజ్ తో కలిసి స్టైల్ గా కూర్చున్న ఫోటో అభిమానులకు తెగ నచ్చేసింది. ఆ జీపు మీద పెట్టి ఉన్న పవన్ కళ్యాణ్ బూట్లు వాళ్ళను ఇంకా ఆకర్షించింది. వెంటనే దాని ఫోటో ని క్రాప్ చేసి గూగులే లో వెతకడానికి ప్రయత్నం చేసారు.అయితే ఈ బూట్ల ధర దాదాపుగా వెయ్యి డాలర్ల వరకు ఉంటుందని అంచనా, వెయ్యి డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 80 వేల రూపాయిలు అన్నమాట.

80 వేల రూపాయిలు అంటే ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం బ్రతికేస్తుంది అనే చెప్పాలి.ఇలాంటివి కొనడానికి మనకు అసాధ్యం, కానీ చూసేందుకు ఆ బూట్లు ఎంతో అందం గా ఉన్నాయి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.ఇక పోతే ఈ సినిమాకి సంబంధించిన మొదటి సాంగ్ ని ఈ నెల మొదటి వారం లోనే విడుదల చెయ్యబోతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
Oktelugu Epaper
Exit mobile version