Mahesh Babu : వయస్సు పెరిగే కొద్దీ ఎవరికైనా అందం తరగిపోవడం అనేది సర్వసాధారణమైన విషయం.కానీ కొంతమంది మాత్రం ఎన్నేళ్లు అయినా నిత్యయవ్వనం తో ఉంటారు, అసలు శరీరానికి వీళ్ళు ఏమి రాస్తుంటారు?, 50 ఏళ్ళ వయస్సు వచ్చినా కూడా ముఖం లో ఆ చార్మ్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి అంతు చిక్కని ప్రశ్న. అలాంటి హీరోలలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు.
ప్రతీ ఏడాది ఈయన అందం మునుపటి కంటే గ్లామర్ గా పెరుగుతూ ఉంది. ఆయన వయస్సు సుమారుగా 48 ఏళ్ళు ఉండొచ్చు. ఇంత వయస్సు లో కూడా ఆయన తళతళ మెరిసిపోతూ, నేటి తరం కుర్ర హీరోలకంటే కూడా అందం గా కనిపిస్తుంటాడు. అసలు మహేష్ బాబు మరియు ఆయన తనయుడు గౌతమ్ బాబు ని పక్కపక్కన నిల్చోపెడితే తండ్రి కొడుకులు అని ఎవరూ అనుకోరు, అన్నదమ్ములు అని అనుకుంటారు.
అయితే మహేష్ ఈ వయస్సులో కూడా ఇంత అందంగా కనిపించడానికి కారణాలు ఉన్నాయి. ఆయన జిమ్ లో చేసే వర్కౌట్స్ చూస్తే అసలు ఈయన వయస్సు ఏంటి, ఆ పరిగెత్తే స్పీడ్ ఏంటి, అసలు మనిషేనా అని అనుకుంటాము. రీసెంట్ గా విడుదలైన వీడియో చూస్తే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. ముఖ్యంగా ట్రెడ్ మిల్ మీద ఆయన పరిగెత్తే తీరు చూస్తుంటే ఆమ్మో ఈయన మామూలు మనిషి కాదు అని అనిపించక తప్పదు. ఇంకా జిమ్ లో కుర్రాళ్ళు ఏమేమి వ్యాయామాలు చేస్తారో అవన్నీ మహేష్ బాబు చేస్తున్నాడు.
ఇదంతా ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల కోసమే అని అంటున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ తో కలిసి ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్టున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన రాజమౌళి తెరకెక్కించి చిత్రం లో నటించబోతున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాడట. అందుకే ఆయన రేంజ్ లో వర్కౌట్స్ చేస్తున్నాడని అంటున్నారు.
yay anna pic.twitter.com/3uUr6EBnQ3
— #️ (@deepu_tweetz) July 1, 2023