Pawan Kalyan Dress: రీసెంట్ గా జరిగిన వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి నిశ్చితార్ధ వేడుకలో పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు కంటే కూడా, పవన్ కళ్యాణ్ ఎక్కువగా హైలైట్ అయినా సంగతి అందరికీ తెలిసిందే. ఫార్మల్ షర్ట్ మరియు జీన్స్ ప్యాంట్ వేసుకొని స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చిన పవన్ కళ్యాణ్ లుక్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండింగ్ అవుతుంది. ఆరోజు పవన్ కళ్యాణ్ #OG మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.
ఆరోజే ఆయన నేరుగా లొకేషన్ నుండి నిశ్చితార్థం కి విచ్చేశాడు.కాస్ట్యూమ్స్ కూడా షూటింగ్ కి సంబంధించినవే, ఇంత స్టైలిష్ గా ఉంది, షర్ట్ మరియు జీన్స్ ప్యాంట్ చాలా ధర ఉంటుందేమో అని అనుకున్నారు. అందుకే చాలా మంది ఆన్లైన్ లో చూసేందుకు కూడా సాహసించలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఆరోజు వేసుకున్న ప్యాంట్ ధర ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్.
ఆ జీన్స్ ప్యాంట్ ధర లక్షల్లో ఉంటుంది అనుకుంటే పెద్ద పొరపాటే, కేవలం 4199 రూపాయలకు ఆన్లైన్ ఈ ప్యాంట్ అందుబాటులో దొరుకుతుంది. ఈ జీన్స్ ప్యాంట్ బ్రాండ్ పేరు ‘టోకి’. ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ వంటి ఈ కామర్స్ యాప్స్ లో అందుబాటులో ఉంది. స్టాక్ అతి తక్కువ మాత్రమే ఉందట, కాబట్టి ఫ్యాన్స్ అందరూ తొందరగా బుక్ చేసుకోండి. బుక్ చేసిన మూడు రోజుల్లో ఈ ప్యాంట్ డెలివరీ అయిపోతుంది.
ఇక పోతే నిన్నమొన్నటి వరకు షూటింగ్స్ లో బిజీ గా గడిపిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు రేపటి నుండి వారాహి టూర్ లో బిజీ కాబోతున్నాడు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఆయన నిన్న మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో ఒక యాగం కూడా నిర్వహించారు. ఈ యాగానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్న వాళ్ళందరూ హాజరయ్యారు.