Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అయితే ఉంది. ఆయన చేసిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా నుంచి ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల వరకు అన్నింటిలో ఆయన కంటూ ఒక ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకోవడమే కాకుండా అందులో వైవిధ్యమైన నటనను కూడా చూపిస్తూ వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా కూడా చాలా బిజీగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలన్నింటిలో ఆయనకు చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తను చేసిన కొన్ని సినిమాల్లో ఆయనే ఫైట్స్ కంపోజ్ చేసుకున్నాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా బద్రి, ఖుషి, జానీ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో కొన్ని ఫైట్స్ ని ఆయనే డైరెక్ట్ చేశాడు.
ఇక ఇప్పుడు ఓ జీ సినిమాలో కూడా మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన కొన్ని ఫైట్లను ఆయనే చిత్రీకరించారట. ఇక మిగతా ఫైట్స్ ని కూడా ఆయన చేతుల మీదుగానే చేయించాలని సుజీత్ భావిస్తున్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం ఉంది. కాబట్టి ఆయన ఆ ఫైట్ లను చాలా ఈజీగా కొరియోగ్రఫీ చేయగలుగుతున్నారు.
ఏది ఏమైనా కూడా ప్రస్తుతం సుజిత్ ఓజి సినిమా మీదనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన కెరీర్ అనేది ఒక్కసారిగా మారిపోతుంది. అలాగే పాన్ ఇండియా దర్శకుడి గా కూడా ఎదుగుతాడు. కాబట్టి ఈ సినిమా అతనికి చాలా కీలకంగా మారనుంది. ఇక అందువల్లే పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఆయన చాలావరకు ఈగర్ గా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
అందుకే ఆయన చేస్తున్న సినిమాల మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇదిలా ఉంటే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు తద్వారా పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ దక్కుతుంది అనేది…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Do you know the movies composed by power star pawan kalyan fights
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com