Sekhar Kammula: శేఖర్ కమ్ముల ను పరీక్షించి హిట్ ఇచ్చిన సినిమా ఏంటో తెలుసా?

హీరోలు, లేదా హీరోయిన్ లు రిజెక్ట్ చేసిన సినిమాలు హిట్ అయిన, ఫ్లాప్ అయిన ఆ సినిమాను కాదనుకున్న నటీనటులు సంతోషం, బాధను వ్యక్త పరుస్తుంటారు.

Written By: Swathi Chilukuri, Updated On : February 16, 2024 11:27 am
Follow us on

Sekhar Kammula: సినిమా తెరకెక్కించాలంటే ఎంతో కష్టం. సినిమా తెరకెక్కించడం ఎంత కష్టమో.. ఆ సినిమాను థియేటర్ లలో విడుదల చేసేవరకు అంతకంటే ఎక్కువ కష్టపడాలి. ఒక సినిమా కథ రాసుకోవడం, ఆ సినిమా కథను హీరోహీరోయిన్ లకు చెప్పడం. మళ్లీ డిస్ట్రిబ్యూటర్ లను మాట్లాడుకోవడం వంటివి నార్మల్ ఇష్యూ కాదు. ఇదంత పెద్ద తలనొప్పే అని చెప్పాలి. ఒక వేళ సినిమా హిట్ అయితే కష్టానికి తగిన ఫలితం వస్తుంది. లేదంటే పడ్డ కష్టం మొత్తం హృదా అవుతుంది. ఇదిలా ఉంటే కొందరు సినిమాను రిజెక్ట్ చేస్తారు.

హీరోలు, లేదా హీరోయిన్ లు రిజెక్ట్ చేసిన సినిమాలు హిట్ అయిన, ఫ్లాప్ అయిన ఆ సినిమాను కాదనుకున్న నటీనటులు సంతోషం, బాధను వ్యక్త పరుస్తుంటారు. ఇక హిట్ అయితే ఈ వార్తలు మరింత ఎక్కువ వస్తుంటాయి. ఈ హిట్ సినిమాను కాదనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? అంటూ వార్తలు వస్తుంటాయి. అయితే ఇండస్ట్రీలో ఒక సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న శేఖర్ కమ్ముల కూడా తన సినిమా విషయంలో ఇలాంటి అనుభవమే పొందారు. ఈ స్టార్ డైరెక్టర్ మొదట్లో సాప్ట్ వేర్ ఉద్యోగం చేశారు.

సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఉద్యోగాన్ని వదిలి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మొదట డాలర్ డ్రీమ్స్ అనే సినిమా తీసి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు ఈ డైరెక్టర్. ఈ సినిమా రిజల్ట్ తో శేఖర్ కమ్ములకు ఏకంగా ఉత్తమ జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆనంద్ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఇప్పటికీ కూడా చాలా మందికి గుర్తుంది. ఆనంద్ ఓ మంచి కాఫీలాంటి సినిమా అంటూ పేరు సంపాదించిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమాకు శేఖర్ కమ్ముల చాలా కష్టపడ్డారు.

ఈ సినిమా కథ వినిపించడానికి ఈ డైరెక్టర్ ఎక్కని స్టూడియో లేదు. కానీ ఎవరు కూడా ఒప్పుకోకపోవడంతో తానే సొంతంగా నిర్మించాలని డిసైడ్ అయ్యారు. ఈ సినిమా కోసం ముందుగా ఇతర హీరోలను కూడా సంప్రదించారు. కానీ ఈ సినిమా అదృష్టం రాజాను వరించింది. ఈ సినిమాకోసం ఎన్ఎఫ్ డిసి అనే సంస్థ ఈ సినిమా కోసం రూ. 40 లక్షలు అందించింది. మిగతా డబ్బు తన ఫ్రెండ్స్ నుంచి అప్పు తీసుకున్నారు. ఇక సినిమా తెరకెక్కిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కూడా సపోర్ట్ చేయలేదు. దీంతో ఈ పని కూడా ఆయనే తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఒక ఐదు థియేటర్ లు మాట్లాడుకొని విడుదల చేశారు. విడుదలైన రెండు మూడు రోజులకు చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి సినిమా రైట్స్ అడిగారు. ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకొని సినిమాను వారికి అప్పగించారట. కనీసం డిమాండ్ కూడా చేయలేదట. అలా రాష్ట్రం మొత్తం ఈ సినిమా విడుదల అయింది. మొత్తం మీద ఈ సినిమా కోటి రూపాయల లాభాలను సంపాదించి పెట్టింది సినిమా.