Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan's Mother Anjana Devi: పవ‌న్ తల్లి అంజ‌న‌మ్మ‌తో చూసిన మూవీ అదే.....

Pawan Kalyan’s Mother Anjana Devi: పవ‌న్ తల్లి అంజ‌న‌మ్మ‌తో చూసిన మూవీ అదే.. గుడుంబా శంక‌ర్ అలా సెట్ అయ్యిందంట‌..

Pawan Kalyan’s Mother Anjana Devi: టాలీవుడ్ లో ఏ హీరోకి లేని క్రేజ్ ఒక్క పవన్ కి మాత్రమే ఉంటుంది. ఏ హీరోకి లేని భక్తులు ఒక్క పవన్ కి మాత్రమే ఉంటారు. పవన్ నడక, చూపు, మాట.. ఇలా ప్రతి కదలికలో ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ప‌వన్ కళ్యాణ్ స్వభావంలాగే, ఆయన పర్సనల్ లైఫ్, సినీ కెరీర్ అంతా ఓపెన్ బుక్ అంటుంటారు ఇండ‌స్ట్రీలో చాలామంది. ఎన్ని ప్లాపులు వ‌చ్చినా.. సినిమాలే తీయ‌క‌పోయినా ఆయ‌న క్రేజ్ త‌గ్గ‌దు.

Pawan Kalyan's Mother Anjana Devi
Pawan Kalyan’s Mother Anjana Devi

నిజానికి పవన్ కి ఈ స్థాయి స్టార్ డమ్ రావడానికి కారణం పవన్ మంచితనమే. టాలెంట్ ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు. కానీ.. మంచితనం ఉన్న హీరోలు అరుదుగా ఉంటారు. వాళ్ల‌ల్లో పవన్ కళ్యాణ్ పేరు మొదటగా ఉంటుంది. అందుకే పవన్ క్రేజే కాదు, రేంజ్ కూడా వేరే. దాంతో సహజంగానే పవన్ సినిమాలకు ఉండే క్రేజ్ ఏ హీరో సినిమాకి ఉండదు.

Also Read: Samantha on Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ పై యుద్ధం ప్రకటించిన సమంత.. షాక్ లో ఫాన్స్

పవన్ కళ్యాణ్ ఎన్ని సంవత్సరాలు సినిమా చేయకపోయినా పవన్ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో కోసం ఎన్ని సంవత్సరాలు అయినా ఎదురు చూస్తూనే ఉంటారు. ఖుషీ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ తర్వాత రెండేళ్లు లాంగ్ గ్యాప్ తీసుకొని జానీ సినిమా చేశాడు. జానీ తర్వాత మరోసారి ఏడాదిన్నర గ్యాప్ తీసుకొని గుడుంబా శంకర్ సినిమాలో నటించాడు. గుడుంబా శంక‌ర్ డైరెక్ట‌ర్ బైరిశెట్టి వీర శంక‌ర్ కు ఆ చాన్స్ ఎలా వ‌చ్చిందంటే.. పవన్ గోకులంలో సీత సినిమా చేస్తున్న టైంలో వీరశంకర్ వెన్నెల్లో ఆడపిల్ల నవల ఆధారంగా శ్రీకాంత్ హీరోగా హలో ఐ లవ్ యు.. సినిమా తెర‌కెక్కిస్తున్నారు.

అయితే వెన్నెల్లో ఆడపిల్ల నవల చాలా సార్లు వ‌వ‌న్ అప్ప‌టికే చ‌దివార‌ట.. ఎందుకంటే ఆ నవల అంటే పవన్ కు ఎంతో ఇష్టం. ఈ నవల ఆధారంగా సినిమా తీస్తున్న విషయం తెలుసుకున్న పవన్ పక్కనే షూటింగ్లో ఉన్న వీరశంకర్ ను ఒకరోజు పిలిచి సినిమా పూర్త‌య్యాక ప్రివ్యూ చూపిస్తావా అని సరదాగా అడిగారట. దీంతో ఓకే అని చెప్పిన వీరశంకర్ ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని హలో ఐ లవ్ యు ప్రివ్యూ షోకు పవన్‌ను పిలిచారట. వెంట పవన్ తన తల్లి అంజనమ్మ‌ను కూడా తీసుకువ‌చ్చార‌ట‌.

Pawan Kalyan's Mother Anjana Devi
Pawan Kalyan’s Mother Anjana Devi

హలో ఐ లవ్ యూ ప్రివ్యూ చూసిన పవన్ వీరశంకర్‌ను వాటేసుకుని మెచ్చుకోగా… పవన్ తల్లి అంజనమ్మ సైతం సినిమా బాగుందని వీరశంకర్ కు కితాబు ఇచ్చారట. అయితే వీర శంకర్ త‌న వెడ్డింగ్ కార్డుతో పవన్ దగ్గరకు వెళ్లిన‌ప్పుడు తన కోసం ఓ కథ రెడీ చేసుకోమ‌ని చెప్పార‌ట‌.. దీంతో ఓ కథ‌ పవన్ కు వినిపించ‌గా పవన్ కొన్ని మార్పులు చెప్పడంతో అది అక్కడితో ఆగిపోయింది.

Also Read: Yash- NTR: ఎన్టీఆర్ ఫ్యామిలీ న‌న్ను అలా ట్రీట్ చేస్తారు.. య‌శ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆ త‌ర్వాత శ్రీహరి హీరోగా వీర శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుండ‌గా అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఖుషి షూటింగ్ కూడా జరుగుతోందట. అప్పుడు వీర శంకర్ ని చూసి ఆగిన పవన్ కళ్యాణ్ ఇంకా తన కోసం కథ రెడీ చేయలేదా.. ప్రశ్నించారు అట .అప్పుడు గుడుంబా శంకర్ కథ రెడీ చేసుకుని పవన్ కు వినిపిస్తే పవన్ చిన్న చిన్న మార్పులతో ఓకే చేశారట. అలా తమ కాంబినేషన్ సెట్ అయిందని వీరశంకర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular