
Minister Roja Jabardasth : జబర్ధస్త్ రోజా.. ఎమ్మెల్యే రోజా.. ఫైర్ బ్రాండ్ రోజా నుంచి ఇప్పుడు మంత్రి రోజా వరకూ ఆమె ప్రయాణం అనితరసాధ్యమనే చెప్పొచ్చు. సినీ నటిగా మొదలైన ఆమె ప్రయాణం రాజకీయాల్లోకి వచ్చి రెండు సార్లు ఎన్నికల్లో ఓడి అనంతరం రెండు సార్లు వరుసగా గెలిచి.. చివరకు అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో రెండో దఫాలో మంత్రి పదవి దక్కించుకుంది.
ఇన్నాళ్లు రోజా ఎమ్మెల్యేగా ఉన్నా తన నియోజకవర్గ ప్రజలకు ఓవైపు సేవ చేస్తూనే.. మరోవైపు జబర్ధస్త్ సహా పలు టీవీ షోలతో ప్రేక్షకులకు చేరువైంది. ఈటీవీ జబర్ధస్త్ ను నాగబాబు వదిలిపెట్టినా.. రోజా మాత్రం వదలకుండా దాన్ని కంటిన్యూ చేసి కంటెస్టెంట్లను కాపాడుకొని కామెడీషోను విజయవంతంగా నడిపించింది.

అయితే ఇప్పుడు రోజా మంత్రి కావడంతో వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా.. తాను పాల్గొంటున్న ‘జబర్ధస్త్ ’ షోను విడిచిపెట్టింది. ఇన్నేళ్లుగా షోలో డ్యాన్సులు చేస్తూ, కామెడీ చేస్తూ.. స్కిట్ లలో నటిస్తూ పెద్ద దిక్కుగా ఉన్న రోజా జబర్ధస్త్ ను వీడి వెళుతుండడంపై ఎమోషనల్ అయ్యింది.
ఈ క్రమంలోనే చివరి ఎపిసోడ్ లో రోజాకు జబర్ధస్త్ టీం సన్మానం చేసింది. ఈ సందర్భంగా వారి సన్మానానికి రోజా ఎమోషనల్ అయ్యింది. కన్నీరు కార్చింది. జబర్ధస్త్ చేశాకనే తాను ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచానని.. ఇక్కడే మంత్రి కావాలనుకున్నానని.. అది నెరవేరిందని రోజా ఎమోషనల్ అయ్యింది. ఈ సందర్భంగా ప్రజా సేవ కోసం జబర్ధస్త్ ను వదలకతప్పడం లేదని.. నా కిష్టమైన షోకు దూరం కావడంపై ఏడ్చేసింది.
రోజా చివరి జబర్ధస్త్ షో ప్రోమో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోను కింద చూడొచ్చు.