Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి కూడా అందరి లాగానే కెరీర్ లో ఎన్నో ఓడిడుగులు ఎదుర్కొని పైకి ఎదిగిన వారు. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీ లో పెద్ద రచయితా, సోదరుడు కీరవాణి పెద్ద సంగీత దర్శకుడు, ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఆయన దానిని ఉపయోగించకుండా, తన సొంత కష్టం, ప్రతిభ తో ఇండస్ట్రీ లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు.
దర్శకత్వం మీద అమితాసక్తి ఉన్న రాజమౌళి కి, రాఘవేంద్ర రావు వద్ద ఓనమాలు నేర్చుకొని ఆ తర్వాత ‘శాంతి నివాసం’ అనే సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఇక పోతే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకు రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు, అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘రాజకుమారుడు’ అనే చిత్రం కూడా ఒక్కటి.
బాలనటుడిగా ఇండస్ట్రీ లో గొప్పగా రాణించిన మహేష్ బాబు, పూర్తి స్థాయి కమర్షియల్ హీరో గా టాలీవుడ్ కి పరిచయం అవుతూ చేసిన మొదటి సినిమా ఇది. ఈ చిత్రం కమర్షియల్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చి ఆరోజుల్లోనే 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా రాజమౌళి పని చేసాడు అనే విషయం చాలా మందికి తెలియదు. కానీ రీసెంట్ గా ఆ చిత్ర దర్శకుడు రాఘవేంద్ర రావు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం చెప్పుకొచ్చాడు.
ఆరోజు మహేష్ మొదటి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన రాజమౌళినే, నేడు పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగి 1500 కోట్ల రూపాయిలు ఖర్చు చేసి, అతి త్వరలోనే ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు పుట్టిన రోజు నాడు పూజ కార్యక్రమాలు జరుపుకోబోతుంది. ఈ కాంబినేషన్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రపంచం లో ఉన్న సినీ అభిమానులు మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.