Mahesh Babu: షాకింగ్..మహేష్ బాబు దర్శకత్వం వహించిన సినిమా అదేనా..? ఇండస్ట్రీ రికార్డ్స్ కూడా తిరగరాసిందిగా!

ఇలా ఉండగా ఒకప్పుడు చాలా మామూలు హీరో గా ఉండే మహేష్ బాబు, 'పోకిరి' చిత్రం తో సూపర్ స్టార్ గా మారిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాని తొలుత మహేష్ బాబు తో చెయ్యాలని అనుకోలేదు. పవన్ కళ్యాణ్ తో కానీ, లేదా రవితేజ తో కానీ చేద్దాం అనుకున్నారు. వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని మిస్ అయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు కి ఈ కథ వినిపించగా, ఆయన వెంటనే ఓకే చేసి ఈ చిత్రాన్ని చేసాడు.

Written By: Vicky, Updated On : July 25, 2023 4:23 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu: టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్నటువంటి అద్భుతమైన ఫిల్మోగ్రఫీ ఏ స్టార్ హీరోకి కూడా లేదని అందరు అంటుంటారు. అందులో ఎలాంటి అతిశయం లేదు, ఆయన మొదటి సినిమా నుండి ఇది ఒకసారి పరిశీలిస్తే , అట్టర్ ఫ్లాప్ సినిమాలను సైతం ఒకసారి చూసే విధంగా ఉంటాయి. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇదంతా ఆయన జీనీస్ స్క్రిప్ట్ సెలక్షన్ వల్లే అని ఆయన ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు.

అయితే ప్రయోగాలు ఎక్కువ చెయ్యడం వల్ల మహేష్ కెరీర్ లో డిజాస్టర్ ఫ్లాప్స్ బాగా వచ్చాయి. దాని వల్ల ఆయన మార్కెట్ ఒకానొక దశలో తగ్గింది కూడా. అప్పటి నుండి ఆయన ప్రయోగాల జోలికి పోకుండా, కేవలం కమర్షియల్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. రీసెంట్ గానే ‘సర్కారు వారి పాట’ సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్న మహేష్ బాబు, గుంటూరు కారం అనే చిత్రం చేస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా ఒకప్పుడు చాలా మామూలు హీరో గా ఉండే మహేష్ బాబు, ‘పోకిరి’ చిత్రం తో సూపర్ స్టార్ గా మారిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాని తొలుత మహేష్ బాబు తో చెయ్యాలని అనుకోలేదు. పవన్ కళ్యాణ్ తో కానీ, లేదా రవితేజ తో కానీ చేద్దాం అనుకున్నారు. వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని మిస్ అయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు కి ఈ కథ వినిపించగా, ఆయన వెంటనే ఓకే చేసి ఈ చిత్రాన్ని చేసాడు.

పవన్ కళ్యాణ్ మరియు రవితేజ వద్దకి ఈ స్టోరీ వెళ్లినప్పటికీ, మహేష్ బాబు వద్దకి కథ వచ్చినప్పటికీ స్క్రిప్ట్ లో చాలా మార్పులు జరిగాయట. ఆ మార్పులు , చేర్పులు చేసింది మొత్తం సూపర్ స్టార్ మహేష్ బాబు అట. అంతే కాదు చాలా సన్నివేశాలకు ఆయన దర్శకత్వం కూడా వహించాడట ఈ చిత్రానికి. ముఖ్యంగా షెడ్డు ఫైట్ మొత్తం మహేష్ బాబు కంపోజ్ చేయించుకొని చేసిందట. ఈ విషయం చాలా కాలం వరకు ఎవరికీ తెలియదు.